Share News

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి

ABN , Publish Date - Sep 27 , 2026 | 01:27 AM

: కూటమి నేతలు సమన్వయంతో స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి బీసీ జనార్దనరెడ్డి, టీడీపీ రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు కోరారు.

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి
సమావేశంలో మంత్రి జనార్దనరెడ్డి, ప్రసాద్‌బాబు

రాయచోటి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : కూటమి నేతలు సమన్వయంతో స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి బీసీ జనార్దనరెడ్డి, టీడీపీ రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు కోరారు. శనివారం స్థానిక స్టేట్‌ గెస్ట్‌హౌ్‌సలో కూటమి నేతలతో సమావేశమయ్యారు. మున్సిపల్‌ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక, స్థానిక పరిస్థితులు, ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. మంత్రి మాట్లాడుతూ పార్టీలు, రాజకీయాలు పక్కనపెట్టి సీటు ఎవరికొచ్చినా వారి గెలుపు కోసం పనిచేయాలన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు, విభేదాలను పక్కనపెట్టాలని సూచించారు. ఐక్యంగా పనిచేస్తే గెలుపు సులువవుతుందని వివరించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ సమావేశంలో జోనల్‌ కమిటీ చైర్మన్‌ దామచర్ల సత్య, మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి, నాగోతు రమేష్‌, తాతంశెట్టి నాగేంద్ర, కృష్ణ, తంబళ్లపల్లె, పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జులు శంకర్‌యాదవ్‌, మధుసూదన్‌నాయుడు, బీజేపీ నేతలు దారం అనిత, నరేంద్ర, చల్లపల్లి నరసింహారెడ్డి హాజరయ్యారు.

Updated Date - Sep 27 , 2026 | 01:27 AM