Share News

నామినేషన్లు చింపుతుంటే చూస్తుంటారా?

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:57 AM

ఎస్‌ఆర్‌పురంలోని ఎంపీటీసీ స్థానాల నామినేషన్‌ కేంద్రంలో గురువారం జరిగిన ఘటనపై ఎస్పీ తుషార్‌ డూడీ శుక్రవారం చర్యలు తీసుకున్నారు.

నామినేషన్లు చింపుతుంటే చూస్తుంటారా?
జీవన్‌బాబును అరెస్టు చేసిన పోలీసులు

నలుగురు పోలీసులపై క్రమశిక్షణా చర్యలు

ఎస్‌ఐ, సీఐలకు ఛార్జ్‌ మెమో

ఎస్‌ఆర్‌పురం ఘటనపై ఎస్పీ ఆదేశం

నిందితుడు, టీడీపీ నేతపై కేసు, జైలుకు..

చిత్తూరు/శ్రీరంగరాజపురం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఆర్‌పురంలోని ఎంపీటీసీ స్థానాల నామినేషన్‌ కేంద్రంలో గురువారం జరిగిన ఘటనపై ఎస్పీ తుషార్‌ డూడీ శుక్రవారం చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఎస్‌ఆర్‌పురంలో వైసీపీ తరఫున నామినేషన్‌ వేసేందుకు వచ్చిన అత్తూరు జ్యోతి వద్ద ఉన్న పత్రాలను టీడీపీ నేత జీవన్‌బాబురెడ్డి చించేశారనేది ఆరోపణ. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఏఎ్‌సఐ ఆంజనేయులు, హెడ్‌ కానిస్టేబుల్‌ కిశోర్‌కుమార్‌, కానిస్టేబుళ్లు రవి, అల్లిముత్తు నిర్లక్ష్యంతో అడ్డుకోలేదనేది మరో ఆరోపణ. వీటిపై ఎస్పీ తుషార్‌ విచారించి చర్యలు తీసుకున్నారు. టీడీపీ నేత జీవన్‌బాబురెడ్డి మీద కేసు నమోదు చేసి రిమాండుకు పంపించారు. అక్కడే విధుల్లో ఉన్న నలుగురు పోలీసులపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఎస్‌ఐ సుమన్‌, సీఐ హనుమంతప్పకు చార్జ్‌ మెమోలు ఇచ్చారు. నగరి డీఎస్పీ చంద్రశేఖర్‌నాయక్‌కు కూడా షోకాజ్‌ నోటీసును అందించారు. ప్రస్తుతం ఈ చర్యలు జిల్లా పోలీసు వర్గాల్లో, టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి.

Updated Date - Oct 24 , 2026 | 12:57 AM