కొండచుట్టు మండపం కనుమరుగేనా?
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:01 AM
రాజులు పోయారు..రాజ్యాలు పోయాయి...కానీ వారు నిర్మించిన కట్టడాలు మాత్రం నాటి చరిత్రను మనకు గుర్తు చేసే చిహ్నాలుగా మారిపోయాయి. వందల ఏళ్లు గడిచినా అలనాటి నిర్మాణ చతురతను, వారి నైపుణ్యాన్ని గుర్తు చేస్తున్నాయి.
నగరి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రాజులు పోయారు..రాజ్యాలు పోయాయి...కానీ వారు నిర్మించిన కట్టడాలు మాత్రం నాటి చరిత్రను మనకు గుర్తు చేసే చిహ్నాలుగా మారిపోయాయి. వందల ఏళ్లు గడిచినా అలనాటి నిర్మాణ చతురతను, వారి నైపుణ్యాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇలాంటి చారిత్రక కట్టడాల్లో ఒకటైన నగరి కొండచుట్టు మండపం జాతీయ రహదారి వెడల్పులో భాగంగా కూల్చివేతకు రంగం సిద్ధమైంది.600 ఏళ్ళ చరిత్ర వున్న ఈ మండపం సాళువ రాజుల పాలనలో నిర్మించబడినట్లు చరిత్ర చెబుతోంది. ఈ మండపం వద్ద జరిగే కొండచుట్టు ఉత్సవాలు జిల్లావ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి.వేలాదిసంఖ్యలో జనం పాల్గొంటారు.విదేశాలకు వెళ్లిన వారు సైతం సెలవులు పెట్టి ఈ ఉత్సవాల్లో కలుసుకుంటారు.21 మంది గ్రామ దేవతలు ఒకే చోటకు వచ్చే ఈ ఉత్సవాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ కొండచుట్టు మండపం వద్ద మాత్రమే జరుగుతాయి. ఇంతటి విశిష్టత కలిగిన మండపాన్ని జాతీయ రహదారి వెడల్పులో కూల్చేయకుండా కాపాడుకునేందుకు నగరి ప్రజలు నడుంబిగించారు. గత చరిత్రకు చిహ్నంగా ఉన్న మండపాన్ని కాపాడాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలంటూ పిలుపునిచ్చారు. తిరుపతి-తిరుత్తణి రోడ్డు నిర్మాణంలో భాగంగా దీన్ని తొలగించనున్నారు.చారిత్రక విశిష్టతను కాపాడడం అందరి బాధ్యతగా భావించి రోడ్డు పనులు చేపట్టాలని కోరుతున్నారు. పూర్వీకుల విశిష్ట నిర్మాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వారి వారసులుగా తమపై ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.