Share News

ఈ ‘పాప’ం ఎవరిది?

ABN , Publish Date - Apr 30 , 2026 | 02:00 AM

ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో ఏమో ముక్కుపచ్చలారని పసికందును పొలాల్లో పడేసింది. హృదయ విదారకమైన ఈ ఘటన రామసముద్రం మండలం నారిగానిపల్లె పంచాయతీలో చోటుచేసుకుంది.

ఈ ‘పాప’ం ఎవరిది?
పసికందు మృతదేహం

పొలాల్లో పసికందు మృతదేహం

రామసముద్రం, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో ఏమో ముక్కుపచ్చలారని పసికందును పొలాల్లో పడేసింది. హృదయ విదారకమైన ఈ ఘటన రామసముద్రం మండలం నారిగానిపల్లె పంచాయతీలో చోటుచేసుకుంది. ఉదయాన్నే వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన ఓ మహిళకు ఎలకపల్లె సమీపంలోని పంట పొలాల్లో రోజులు కూడా నిండని ఓ పసిపాప మృతదేహం కనిపించింది. భర్త సురేంద్రకు విషయం తెలిపింది. సురేంద్ర పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశారు. రామసముద్రం తహసీల్దార్‌ మహ్మద్‌అజారుద్దీన్‌, ఎస్‌ఐ రుషికేశవరెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిశీలించారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Apr 30 , 2026 | 02:00 AM