Share News

కోట’లో పాగా వేసేదెవరో!

ABN , Publish Date - Nov 25 , 2026 | 01:58 AM

నగర పంచాయతీగా ఆవిర్భవించాక జరుగుతున్న తొలి ఎన్నికలకు సంబంధించి మంగళవారం సాయంత్రం ప్రచారం ముగిసింది. కోట ఛైర్మన్‌ పీఠంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రచారానికి తెరపడటంతో ఇక ప్రలోభాలకు తెరలేచిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఛైర్మన్‌ పదవికి 9మంది, కౌన్సిలర్‌ స్థానాలకు 70మంది పోటీ పడుతున్నారు. 2020 డిసెంబర్‌ 30న ు. ఈ నగర పంచాయతీగా అప్‌గ్రేడ్‌ అయిన క్రమంలో ఈసారి ఛైర్మన్‌స్థానం బీసీ జనరల్‌ కేటగిరీకి కేటాయించారు. టీడీపీ తరఫున పట్టణానికి చెందిన కుడుం శ్రీనివాసులు , వైసీపీ అభ్యర్థిగా పాగొండ ఖలీల్‌అహ్మద్‌ బరిలో నిలిచారు. కుడుంకు మద్దతుగా మంత్రులు బీసీజనార్దన్‌ రెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, జడ్పీఛైర్మన్‌ సుగవాసి ప్రసాద్‌, తంబళ్లపల్లి ఇన్‌చార్జి శంకర్‌యాదవ్‌, పరిశీలకు పోలందినే్‌షరెడ్డిలు ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీ పక్షాన ఎంపీ మిధున్‌రెడ్డి, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాఽథరెడ్డిలు పనిచేస్తున్నారు.

కోట’లో పాగా వేసేదెవరో!
బి.కొత్తకోట పట్టణం ఏరియల్‌ వ్యూ

  • నగర పంచాయతీలో ముగిసిన ప్రచారం

  • సర్పంచ్‌ అభ్యర్థుల మధ్య తీవ్ర పోరు

మొత్తం ఓటర్లు: 23,368

పురుషులు: 12,931

మహిళలు:12,605మంది.

వార్డులు : 23

బి.కొత్తకోట, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): నగర పంచాయతీగా ఆవిర్భవించాక జరుగుతున్న తొలి ఎన్నికలకు సంబంధించి మంగళవారం సాయంత్రం ప్రచారం ముగిసింది. కోట ఛైర్మన్‌ పీఠంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రచారానికి తెరపడటంతో ఇక ప్రలోభాలకు తెరలేచిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఛైర్మన్‌ పదవికి 9మంది, కౌన్సిలర్‌ స్థానాలకు 70మంది పోటీ పడుతున్నారు. 2020 డిసెంబర్‌ 30న ు. ఈ నగర పంచాయతీగా అప్‌గ్రేడ్‌ అయిన క్రమంలో ఈసారి ఛైర్మన్‌స్థానం బీసీ జనరల్‌ కేటగిరీకి కేటాయించారు. టీడీపీ తరఫున పట్టణానికి చెందిన కుడుం శ్రీనివాసులు , వైసీపీ అభ్యర్థిగా పాగొండ ఖలీల్‌అహ్మద్‌ బరిలో నిలిచారు. కుడుంకు మద్దతుగా మంత్రులు బీసీజనార్దన్‌ రెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, జడ్పీఛైర్మన్‌ సుగవాసి ప్రసాద్‌, తంబళ్లపల్లి ఇన్‌చార్జి శంకర్‌యాదవ్‌, పరిశీలకు పోలందినే్‌షరెడ్డిలు ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీ పక్షాన ఎంపీ మిధున్‌రెడ్డి, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాఽథరెడ్డిలు పనిచేస్తున్నారు.

ఎవరి బలం వారిది

ఇరువురికీ పట్టణంలో బంధువర్గం, అనుచరులు, సామాజికవర్గాల అండదండలు ఉన్నాయి. సర్పంచ్‌గా పనిచేసిన కుడుంశ్రీనివాసులు తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తున్నారు. కూటమి అభ్యర్థిగా తనను గెలిపిస్తే ప్రభుత్వం నుంచి భారీ నిధులు తీసుకొస్తానంటున్నారు. గతంల ఎంపీపీగా పనిచేసిన ఖలీల్‌ అహ్మద్‌ బి.కొత్తకోటను నగరపంచాయతీగా అప్‌గ్రేడ్‌ చేసింది తామేనని, ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిపెంచి వైధ్యసేవలు మెరుగుపరిచామని, ఎంపీల్యాడ్స్‌ నిధులతో పట్టణాన్ని తీర్చిదిద్దుతానని ప్రజలకు వివరిస్తున్నారు. వారం రోజుల పాటు జరిగిన ప్రచారానికి మంగళవారం తెరపడింది. గురువారం పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ప్రలోభాలు మొదలయ్యాయి.

Updated Date - Nov 25 , 2026 | 01:58 AM