ఎక్కడ.. ఏం జరిగింది?
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:03 AM
పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్‌రూమ్ నుంచి సిబ్బంది పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లోని అధికారులకు ఇక్కడ నుంచి సూచనలు, సలహాలు ఇచ్చారు.
చిత్తూరు కలెక్టరేట్, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్‌రూమ్ నుంచి సిబ్బంది పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లోని అధికారులకు ఇక్కడ నుంచి సూచనలు, సలహాలు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 1581 పోలింగ్ కేంద్రాల్లో కలెక్టర్ సుమిత్‌కుమార్ సూచనల మేరకు సీసీ కెమెరాలు, వెబ్‌కెమెరాలు, వీడియోగ్రఫీలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద, లోపల సీసీ కెమెరాలతో కూడిన వెబ్‌కాస్టింగ్ వ్యవస్థ ద్వారా అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రాజెక్టు ఆఫీసర్ రవి పర్యవేక్షణలో దశలవారీగా సిబ్బంది పోలింగ్ సరళిని పరిశీలించారు. ఫిర్యాదులు అందే ప్రాంతాల్లోని కేంద్రాల్లో పోలింగ్ సరళి రికార్డు అయిన సీసీ ఫుటేజీని భద్రపరుస్తారు. ఎక్కడైనా కోర్టు నుంచి ఆదేశాలు వస్తే భద్రపరిచిన సీసీ ఫుటేజీని కోర్టుకు అందిస్తారు.