Share News

మా ఓటెక్కడుంది?

ABN , Publish Date - Nov 01 , 2026 | 01:41 AM

తిరుపతి నగర పాలక ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన డివిజన్ల పునర్వ్యవస్థీకరణ ఓటర్లకు ఇక్కట్లు తెచ్చి పెట్టింది. గతంలో 50 డివిజన్లు ఉండగా.. ప్రస్తుతం 66 డివిజన్లకు పెరిగిన విషయం తెలిసిందే. దీనివల్ల తమ ఓటు ఏ డివిజన్‌ పరిధిలోకి వెళ్లిందో తెలియడం లేదని పలువురు ఓటర్లు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, నిరక్షరాస్యులు, ఆన్‌లైన్‌పై అవగాహన లేనివారు చేతిలో ఓటరు ఐడీ కార్డు పట్టుకుని సమీప సచివాలయ చుట్టూ తిరుగుతున్నారు. ఆదివారం పోలింగ్‌ ఉన్నా ఓటరు స్లిప్పులు తమ చేతికి అందక గందరగోళానికి గురవుతున్నారు.

మా ఓటెక్కడుంది?
ఓటు ఎక్కడుందో తెలియక 8,9 వార్డు సచివాలయానికి వచ్చిన ఓటర్లు

సచివాలయాలకు క్యూకట్టిన ఓటర్లు

డివిజన్ల పునర్వ్యవస్థీకరణే కారణం

తిరుపతి సెంట్రల్‌, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): తిరుపతి నగర పాలక ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన డివిజన్ల పునర్వ్యవస్థీకరణ ఓటర్లకు ఇక్కట్లు తెచ్చి పెట్టింది. గతంలో 50 డివిజన్లు ఉండగా.. ప్రస్తుతం 66 డివిజన్లకు పెరిగిన విషయం తెలిసిందే. దీనివల్ల తమ ఓటు ఏ డివిజన్‌ పరిధిలోకి వెళ్లిందో తెలియడం లేదని పలువురు ఓటర్లు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, నిరక్షరాస్యులు, ఆన్‌లైన్‌పై అవగాహన లేనివారు చేతిలో ఓటరు ఐడీ కార్డు పట్టుకుని సమీప సచివాలయ చుట్టూ తిరుగుతున్నారు. ఆదివారం పోలింగ్‌ ఉన్నా ఓటరు స్లిప్పులు తమ చేతికి అందక గందరగోళానికి గురవుతున్నారు.

సచివాలయానికే పరిమితమైన బీఎల్వోలు?

ఓటర్లకు అందుబాటులో ఉండాల్సిన బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్వోలు) సచివాలయానికే పరిమితమయ్యారన్న విమర్శలొస్తున్నాయి. దీనివల్లే ఓటు ఎక్కడుంతో తెలుసుకోవానికి సచివాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి వచ్చిందని పలువురు ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Nov 01 , 2026 | 01:41 AM