ఇదేంది జగనా..!
ABN , Publish Date - Aug 28 , 2026 | 01:48 AM
మీరేం చేస్తారో తెలియదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకురావాలి. అధిక ఏకగ్రీవాలు ఉండాలి. అప్పట్లో సీఎం జగన్ వద్ద మార్కులు కొట్టేయాలని వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. ‘పవర్’ను ఇష్టారాజ్యంగా వాడారు. జిల్లాలో ప్రత్యర్థి పార్టీలు నామినేషన్లు వేయకుండా.. వేసినా తిరస్కరణకు గురిచేసేలా చేసి.. ఇలా అక్రమంగా ఏకగ్రీవాలు చేసుకున్నారు.
ఒక్క స్థానమూ ఏకగ్రీవం కావొద్దన్న వైసీపీ అధినేత
విస్మయం వ్యక్తంచేస్తున్న నేతలు, శ్రేణులు
2021లో అక్రమాలను గుర్తు చేసుకుంటున్న ప్రజలు
(చిత్తూరు, ఆంధ్రజ్యోతి)
మీరేం చేస్తారో తెలియదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకురావాలి. అధిక ఏకగ్రీవాలు ఉండాలి.
- ఐదేళ్ల కిందట సీఎం హోదాలో ఎమ్మెల్యేలు, నేతలకు జగన్ ఇచ్చిన అల్టిమేటం.
అప్పట్లో సీఎం జగన్ వద్ద మార్కులు కొట్టేయాలని వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. ‘పవర్’ను ఇష్టారాజ్యంగా వాడారు. జిల్లాలో ప్రత్యర్థి పార్టీలు నామినేషన్లు వేయకుండా.. వేసినా తిరస్కరణకు గురిచేసేలా చేసి.. ఇలా అక్రమంగా ఏకగ్రీవాలు చేసుకున్నారు.