మామిడి రైతుకు ఆ‘ధర’ణ ఏది?
ABN , Publish Date - May 21 , 2026 | 02:07 AM
మామిడి పంట సాగు చేస్తున్న రైతుకు ఆ‘ధర’ణ కరువైంది. ఈ పరిస్థితుల్లో గిట్టుబాటు ధరలేక చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాలెం మండలాల్లో చాలామంది రైతులు తమ మామిడి తోటలను నరికి వేస్తున్నారు.
ఎర్రావారిపాలెం, మే 20 (ఆంధ్రజ్యోతి):మామిడి పంట సాగు చేస్తున్న రైతుకు ఆ‘ధర’ణ కరువైంది. గత వారంలో బేనీషా రూ.40వేల నుంచి రూ.50 వేల మధ్య ఉన్న ధరలు ప్రస్తుతం రూ.15వేల నుంచి రూ.25వేలకు పడిపోయింది. కాయలకు మచ్చ(మంగు) ఉందని, సైజు పెద్దదైనా, చిన్నదైనా రేటు తగ్గిస్తున్నారు. ఏ వెరైటీ అయినా కిలోలకు 3నుంచి 4కాయలు తూగి, మంచి కలర్ (రెడ్) ఉంటేనే కొంటున్నారు. మరోవైపు అడవి జంతువులు, ప్రకృతి వైపరీత్యాలను దాటుకుని పంట చేతికొచ్చాక ఎకరానికి అతికష్టంపై రూ.30వేల వరకు మాత్రమే రైతుకు దక్కుతోంది. ఖర్చు మాత్రం రూ.35వేల వరకు అవుతోంది. ఈ పరిస్థితుల్లో గిట్టుబాటు ధరలేక చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాలెం మండలాల్లో చాలామంది రైతులు తమ మామిడి తోటలను నరికి వేస్తున్నారు. తాజాగా బుధవారం దీన్‌దార్లపల్లె పంచాయతీలోని ఐదెకరాల మామిడి తోటను రాజారెడ్డి అనే రైతు ఒంగోలు కూలీలతో నరికించే పనులు మొదలుపెట్టాడు.