ఎమ్మెల్యే శ్రీధర్‌పై వేసిన త్రిసభ్య కమిటీ ఏమైంది?
ABN , Publish Date - Apr 23 , 2026 | 01:00 AM
రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీధర్‌పై విచారణకు జనసేన అధిష్ఠానం నియమించిన త్రిసభ్య కమిటీ ఏమైందని ఆయనపై లైంగిక ఆరోపణలు చేసిన హర్షవీణ మరోమారు ప్రశ్నించింది.
రైల్వేకోడూరు, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి):రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీధర్‌పై విచారణకు జనసేన అధిష్ఠానం నియమించిన త్రిసభ్య కమిటీ ఏమైందని ఆయనపై లైంగిక ఆరోపణలు చేసిన హర్షవీణ మరోమారు ప్రశ్నించింది. బుదవారం ఆమె విడుదల చేసిన వీడియోలో వైరల్ అయింది. ఎమ్మెల్యే ప్రజా బాహుళ్యంలో తిరగడానికి జనసేన అధిష్ఠానం క్లీన్‌చిట్ ఇచ్చిందా అని ప్రశ్నించారు. తనపై దాడి చేసిన జనసేన రాష్ట్ర కార్యదర్శి నాగేంద్రపై అధికారులు ఎటు వంటి చర్యలు తీసుకోలేదన్న ఆమె తనను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదని హెచ్చరించింది.