మీరంతా ఏం చేస్తున్నారు?
ABN , Publish Date - Apr 01 , 2026 | 01:45 AM
‘జిల్లాలో ఫిబ్రవరి నెలలో ఒక మాత, పది మంది శిశువులు మరణించారు. ఇలా ఒక నెల్లో 11 మాతాశిశు మరణాలు సంభవిస్తుంటే వైద్యాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారు’ అంటూ డీఐవో హనుమంతరావు ప్రశ్నించారు.
ఫిబ్రవరిలో ఒక తల్లి, పది మంది శిశు మరణాలపై సమీక్షలో డీఐవో ఆగ్రహం
చిత్తూరు రూరల్, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ‘జిల్లాలో ఫిబ్రవరి నెలలో ఒక మాత, పది మంది శిశువులు మరణించారు. ఇలా ఒక నెల్లో 11 మాతాశిశు మరణాలు సంభవిస్తుంటే వైద్యాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారు’ అంటూ డీఐవో హనుమంతరావు ప్రశ్నించారు. ఫిబ్రవరి నెలలో మాతా శిశు మరణాలపై మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమీక్షలో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయి సిబ్బంది నిబద్ధతో పనిచేస్తే మాతాశిశు మరణాలు సంభవించవన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్‌సీ వైద్య సిబ్బంది కీలకమని, ప్రతి ఇంటిని పలకరించాలన్నారు. ఏఎన్‌ఎం, ఆశాలు ప్రతి గర్భిణిని సందర్శించాలని, వారికి అందాల్సిన వైద్య పరీక్షలు చేయాలన్నారు. హైరిస్క్ కేసులను ముందుగానే గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. టీకా సకాలంలో వేయించాలని సూచించారు. ఈ సమావేశంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రి ఎంఎస్ ఉషశ్రీ, గైనకాలజిస్టు లత తదితరులు పాల్గొన్నారు.