Share News

ధ్రువీకరణ పత్రాలెప్పుడిస్తారు?

ABN , Publish Date - Jul 20 , 2026 | 01:39 AM

ఓ విద్యార్థి ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణుయ్యాడు. ఏపీ ఈఏపీసెట్‌లో ర్యాంకు సాధించాడు. మరొకొద్ది రోజుల్లో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. దీనికోసం ముందుగా ఆన్‌లైన్‌లో ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్‌ చేయాలి. దీనికోసం రోజుల తరబడి మీ-సేవ కేంద్రం చుట్టూ తిరుగుతున్నాడు. మిగిలిన కేటగిరీల విద్యార్థుల పరిస్థితీ ఇదే.

ధ్రువీకరణ పత్రాలెప్పుడిస్తారు?
కొత్తగా రూపొందించిన ధ్రువపత్రం

ప్రభుత్వ సర్టిఫికెట్ల సరఫరా లేక

విద్యార్థుల అవస్థలు

సూళ్లూరుపేట, ఆంధ్రజ్యోతి

ఓ విద్యార్థి ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణుయ్యాడు. ఏపీ ఈఏపీసెట్‌లో ర్యాంకు సాధించాడు. మరొకొద్ది రోజుల్లో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. దీనికోసం ముందుగా ఆన్‌లైన్‌లో ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్‌ చేయాలి. దీనికోసం రోజుల తరబడి మీ-సేవ కేంద్రం చుట్టూ తిరుగుతున్నాడు. మిగిలిన కేటగిరీల విద్యార్థుల పరిస్థితీ ఇదే.

..ఎందుకంటే ప్రభుత్వం రాజముద్ర హోలోగ్రామ్‌ ఉండే సర్టిఫికెట్ల సరఫరా లేకపోవడమే కారణం.

ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ఏపీఈఏపీ సెట్‌, నీట్‌ పరీక్షలు రాశారు. సీఈసీ, హెచ్‌ఈసీలో ఉత్తీర్ణులైన వారిలో కొంతమంది లాసెట్‌ రాశారు. ఇందులో వచ్చిన ర్యాంకులను బట్టి కోర్సులను, కళాశాలలను ఎంపిక చేసుకుంటారు. ఆయా విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా దరఖాస్తు చేసుకోవడానికి రిజర్వేషన్‌ ఉన్న అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయి. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తీసుకునే వారికి ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లు తప్పనిసరి. దరఖాస్తు చేసుకునేటప్పుటే వీటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఈ ధ్రువపత్రాల కోసం నెల కిందట దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా ఇంకా మీ-సేవ కేంద్రాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

ఎందుకిలా..

ఈ ధ్రువీకరణ పత్రాలను మీ-సేవ కేంద్రాలకు సరఫరా చేసే బాధ్యతను ఓ ప్రైవేట్‌ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ ఖాళీ సర్టిఫికెట్లపై ప్రభుత్వ రాజముద్ర, హోలోగ్రామ్‌ బార్‌కోడ్‌తో ముద్రించి మీ-సేవ కేంద్రాలకు సరఫరా చేయాలి. కొద్ది రోజుల క్రితం ఆ సంస్థ ధ్రువీకరణ పత్రాల సరఫరా నిలిపేసింది.

సిబ్బంది లేక మరింత జాప్యం

జూన్‌ 15 నుంచి జూలై 14వ తేదీవరకు వీఆర్వోలు, ఇతర సిబ్బంది ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) విధుల్లో ఉండటంతో ధ్రువీకరణ పత్రాలకు మరింత జాప్యం జరిగింది. సర్‌ గడువును ఈనెల 24వ తేదీవరకు పొడిగించారు. దీనివల్ల దాదాపు రోజులుగా సచివాలయాలు, రెవెన్యూ కార్యాలయాలన్నీ అధికారులు, సిబ్బంది లేక వెలవెలపోతున్నాయి. ఇకనైనా అధికారులకు ధ్రువీకరణ పత్రాలను సకాలంలో అందేలా చూడాల్సిన అవసరం ఉంది.

Updated Date - Jul 20 , 2026 | 01:39 AM