సంక్షేమ పథకాలే గెలిపించాయి
ABN , Publish Date - Nov 27 , 2026 | 01:55 AM
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి కారణాలయ్యాయని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. గాలివీడు మండలంలోని నూలివీడు పంచాయతీలో ఆయన గురువారం పర్యటించారు.
గాలివీడు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి కారణాలయ్యాయని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని నూలివీడు పంచాయతీలో ఆయన గురువారం పర్యటించారు. కూటమి ప్రభుత్వం రాగానే సామాజిక పింఛన్లను రూ.3వేల నుంచి రూ.4వేలకు పెంచిందన్నారు. రైతు సంక్షేమానికి అన్నదాత సుఖీభవ, మహిళా సంక్షేమం కోసం స్ర్తీ శక్తి, ఉచిత సిలిండర్లు, విద్యాభివృద్ధికి తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. రాబోయే కాలంలో అర్హులందరికీ ప్రభుత్వ గృహాలు, పింఛన్లు అందజేయనున్నట్లు చెప్పారు. జల్‌జీవన్ మిషన్ ద్వారా రాయచోటి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు వెలిగల్లు ప్రాజెక్టు ద్వారా తాగునీటి సౌకర్యాన్ని కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో కొర్లకుంట, పందికుంట ఎంపీటీసీలు ప్రభాకర్‌రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, నూలివీడు మాజీ సర్పంచ్ ఫరీద్‌బాషా, క్లస్టర్ ఇన్చార్జి వెంకటశివారెడ్డి, టీడీపీ నాయకులు నాగేశ్వరరావు, పురుషోత్తంరెడ్డి, వీరాంజనేయులు, లోకేశ్వర్‌రెడ్డి, పాల్గొన్నారు.