అర్హులైన గిరిజనులకు సంక్షేమ పథకాలు
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:20 AM
అర్హులైన గిరిజనులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు పి.వెంకటప్ప తెలిపారు.
ఎస్టీ కమిషన్ సభ్యుడు వెంకటప్ప
పుంగనూరు, జూలై 15 (ఆంధ్రజ్యోతి) : అర్హులైన గిరిజనులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు పి.వెంకటప్ప తెలిపారు. బుధవారం పుంగనూరు జడ్పీ గెస్ట్‌హౌ్‌సలో గిరిజనసంఘ నాయకులు, అధికారులతో గిరిజనుల సమస్యలపై సమీక్షించారు. వినతులు తీసుకుని, వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గిరిజనులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడ్డారని, వాటిని పరిష్కరించడానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని తెలిపారు. రామసముద్రం మండలం గోసువారిపల్లెలో కొంతమంది గిరిజనులకు ఇళ్లు, ఆధార్ కార్డులు లేవని, వెంటనే పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. అసైన్డ్ భూముల ఆక్రమణలు, శ్మశాన వాటికలు, తాగునీరు, విద్యుత్, రోడ్డు, హౌసింగ్ సమస్యలు తీర్చాలన్నారు. తొలుత పుంగనూరు మండలం వనమలదిన్నె పంచాయతీ కుమ్మరగుంట గ్రామంలో పర్యటించి గ్రామంలో దారి సమస్యను పరిష్కరించాలని అధికారులకు చెప్పారు. గ్రామస్తుల నుంచి వినతులు స్వీకరించారు. సమావేశంలో ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్ తేజస్విని, తహసీల్దార్ రాము, ఎంపీడీవో అప్పాజీ, సీఐ సుబ్బరాయుడు, ఎంవీఐ సుప్రియ, ఎరుకుల సంఘ నాయకులు రామకృష్ణ, మర్రిమాలపల్లె బాబు, మునికృష్ణ, బాలు, అక్కులప్పనాయక్, సాకే వీరాంజనేయులు, శ్రీనివా్‌సవర్మ, జగన్, విజయ్‌కుమార్, శ్రీనివాసులు పాల్గొన్నారు.