Share News

సంక్షేమ హాస్టళ్లు సౌకర్యవంతంగా ఉండాలి

ABN , Publish Date - May 27 , 2026 | 01:11 AM

మదనపల్లె జిల్లాలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్లు విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండాలని డీఎ్‌సడబ్ల్యూవో దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు.

సంక్షేమ హాస్టళ్లు సౌకర్యవంతంగా ఉండాలి
వార్డెన్లకు సూచనలిస్తున్న డీఎ్‌సడబ్ల్యూవో దామోదర్‌రెడ్డి

మదనపల్లె టౌన్‌, మే 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్లు విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండాలని డీఎ్‌సడబ్ల్యూవో దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక డీఎ్‌సడబ్ల్యూవో కార్యాలయంలో జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ వసతి గృహాల వార్డెన్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలను పర్యావరణ హితంగా ఉంచాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పక పాటించాలని అన్నారు. ఆరోగ్యకర వాతావరణం నెలకొల్పాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం 100 శాతం వసతి గృహాలు విద్యార్థులతో పూరించాలన్నారు. 2025-26 టెన్త్‌ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన వసతి గృహం విద్యార్థులు జగదీశ్వర్‌రెడ్డి, వినయ్‌లకు ఈనెల 29వ తేదీన సీఎం చంద్రబాబు సమక్షంలో అవార్డులు అందజేస్తారన్నారు. ఈ సమావేశంలో ఏఎ్‌సడబ్ల్యూవోలు శ్రీరాములునాయక్‌, గంగిరెడ్డి, కృష్ణ, వార్డెన్లు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2026 | 01:11 AM