పెళ్లి పీటలెక్కిన ప్రేమికులు
ABN , Publish Date - Jul 14 , 2026 | 02:03 AM
ప్రేమ పేరిట మోసపోయి, న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగిన ఓ యువతి కథ సుఖాంతమైంది. సోమవారం రాత్రి డక్కిలి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రేమికుడితో ఆమెకు వివాహం జరిగింది.
డక్కిలి, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : ప్రేమ పేరిట మోసపోయి, న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగిన ఓ యువతి కథ సుఖాంతమైంది. సోమవారం రాత్రి డక్కిలి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రేమికుడితో ఆమెకు వివాహం జరిగింది. డక్కిలి మండలం గొల్లపల్లె దళిత వాడకు చెందిన కత్తి రేణుక, అదే గ్రామానికి చెందిన వంశీ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.పెళ్లికి వంశీ నిరాకరించడంతో రేణుక ఆదివారం వంశీ ఇంటి ముందు నిరసనకు దిగింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్‌ఐ బ్రహ్మనాయుడు స్పందించారు. హైదరాబాద్‌లో ఉన్న వంశీని సోమవారం ఉదయానికి రప్పించారు. వంశీ తల్లిదండ్రులకు చట్టపరమైన అంశాలపై కౌన్సెలింగ్ ఇచ్చి పెళ్లికి ఒప్పించాక స్థానిక వేంకటేశ్వర స్వామి ఆలయంలో వంశీ, రేణుకల వివాహం శాషో్త్రక్తంగా జరిగింది. తమ కుమార్తెకు అండగా నిలిచిన ఎస్‌ఐకి రేణుక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు,