Share News

స్థానిక ఎన్నికల్లో స్వీప్‌ చేస్తాం

ABN , Publish Date - Sep 27 , 2026 | 01:17 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు అన్ని స్థానాలు గెలుచుకుంటాయని జిల్లా ఇన్‌చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.

స్థానిక ఎన్నికల్లో స్వీప్‌ చేస్తాం
మాట్లాడుతున్న మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి, కూటమి నేతలు

చిత్తూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి

చిత్తూరు సిటి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు అన్ని స్థానాలు గెలుచుకుంటాయని జిల్లా ఇన్‌చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రెండున్నరేళ్లుగా రాష్ట్ర ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామన్నారు. 2024 సాధారణ ఎన్నికలకు మించి స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు. కూటమి నేతలలో విబేధాలు లేవని, అధిస్టానం తీసుకునే నిర్ణయం మేరకు అందరూ కలసి పనిచేస్తామన్నారు. ఎమ్మెల్సీ, జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఇన్‌చార్జి కంచర్ల శ్రీకాంత్‌ మాట్లాడుతూ కూటమి నేతలంతా కుటుంబసభ్యుల్లా కలసి ఉన్నారన్నారు. మాజీ సీఎం జగన్‌ రెడ్డి వీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ఆయన పట్టించుకోకుండా, కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నేరచరిత్ర కలిగిన నేతలను జగన్‌ రెడ్డి పరామర్శిస్తూ, ప్రోత్సహిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడ్డలి పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

జగన్‌రెడ్డి విధ్వంసం

జనసేన పార్టీ జిల్లా ఇన్‌చార్జి, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ కూ టమి పార్టీలను విడదీసేందుకు జగన్‌రెడ్డి అన్ని విధాల ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రా ష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని చెప్పారు. బీ జేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌ నాయుడు మాట్లాడుతూ కూటమి నేతలు సమైక్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు.చిత్తూరు జిల్లాలోనే రూ.33 వేల కోట్లతో ఎన్‌హెచ్‌ రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో నూరుశా తం స్థానాలు గెలుస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌, టీ డీపీ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్‌ కుమార్‌ చౌదరి, చుడా చైర్‌పర్సన్‌ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, రాష్ట్ర మొదలియా ర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ త్యాగరాజన్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కార్జాల అరుణ, ఈశ్వరనాయుడు, టీడీపీ నగర అధ్యక్షుడు వరుణ్‌ కుమార్‌, అట్లూరి శ్రీనివాసులు, మోహన్‌రాజ్‌, లీలావతి, కూటమి నేతలు పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2026 | 01:18 AM