ఎరువుల కృత్రిమ కొరత కారకులను ఉపేక్షించం
ABN , Publish Date - Jul 12 , 2026 | 01:46 AM
‘జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి. యూరియా కొరత లేదు’ అని జాయింట్ కలెక్టర్ గోవిందరావు తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయశాఖాధికారి ప్రసాదరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఇద్దరు డీలర్లపై చర్యలు
14మందికి నోటీసులు
సమస్యలపై 83310 57178 నెంబరుకు ఫిర్యాదు చేయండన్న జేసీ
తిరుపతి(కలెక్టరేట్), జూలై 11 (ఆంధ్రజ్యోతి): ‘జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి. యూరియా కొరత లేదు’ అని జాయింట్ కలెక్టర్ గోవిందరావు తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయశాఖాధికారి ప్రసాదరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎరువులు ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా లేదా అధిక ధరలకు విక్రయించినా అలాంటి డీలర్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిబంఽధనలు అతిక్రమించిన ఇద్దరు డీలర్ల లైసెన్సులు సస్పెండ్ చేయడంతోపాటు మరో 14మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. కలెక్టరేట్‌లో కూడా రైతుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా డీలర్లు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే, ట్యాగింగ్‌కు పాల్పడినా కంట్రోల్‌రూమ్‌లోని 83310 57178 నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ‘ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లా మొత్తం 92,620 హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి. సుమారు 53,050 టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇప్పటికే 21,929 టన్నుల యూరియా జిల్లాకు కేటాయించారు. అందులో 17,775 టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేయడం జరిగింది. ఎరువుల బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టేందుకు ఏపీఏఐఎంఎస్ నూతన డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై యూరియా, డీఏపీ వంటి రసాయన ఎరువులు కొనుగోలు చేయాలంటే రైతులు ఆధార్‌కార్డు సమర్పించాలి. వెబ్‌ల్యాండ్‌లో వివరాలు లేని రైతులకు కూడా సాగు చేసుకునే పంటలకు ఏపీఏఎంఎ్‌సలో నమోదుచేసుకుంటే ఎరువులు కల్పించే అవకాశం కల్పిస్తుంది’ అని జేసీ వివరించారు.