Share News

తోతాపురి కొనుగోలు చేస్తాం : కలెక్టర్‌

ABN , Publish Date - Jun 03 , 2026 | 01:39 AM

ప్రస్తుత సీజన్‌లో రైతుల నుంచి తోతాపురి మామిడిని గుజ్జు పరిశ్రమ యాజమాన్యాలు కొనుగోలు చేస్తుందని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాలులో మామిడి గుజ్జు పారిశ్రామిక యజమానులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పరిశ్రమల నుంచి చెల్లించే నగదు మామిడి గుజ్జు అమ్మకాన్ని బట్టి రైతులకు పారిశ్రామికవేత్తలు నిధులు అందిస్తారన్నారు. గత ఏడాదికంటే ఈ ఏడాది ఎక్కువ పంట వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 తోతాపురి కొనుగోలు చేస్తాం : కలెక్టర్‌
మ్యాంగో పల్ప్‌ ఫ్యాక్టరీ యజమానులతో చర్చిస్తున్న కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత సీజన్‌లో రైతుల నుంచి తోతాపురి మామిడిని గుజ్జు పరిశ్రమ యాజమాన్యాలు కొనుగోలు చేస్తుందని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాలులో మామిడి గుజ్జు పారిశ్రామిక యజమానులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పరిశ్రమల నుంచి చెల్లించే నగదు మామిడి గుజ్జు అమ్మకాన్ని బట్టి రైతులకు పారిశ్రామికవేత్తలు నిధులు అందిస్తారన్నారు. గత ఏడాదికంటే ఈ ఏడాది ఎక్కువ పంట వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మామిడికాయలు పక్వానికి వచ్చాకే కోయాలని, అప్పుడే మంచి ధర వస్తుందన్నారు. 53 హెక్టార్లలో తోతాపురి పంట ఉండగా, ఐదు లక్షల మెట్రిక్‌ టన్నుల మామిడి వస్తుందని చెప్పారు. నాలుగున్నర టన్నుల మామిడిని ఉత్తరాదికి, మిగిలిన ఉత్సత్తి క్రిష్ణగిరి ప్రాంతాల్లోని ఫ్యాక్టరీలు తీసుకుంటాయన్నారు. కృష్ణగిరి కలెక్టర్‌తో మాట్లాడి రైతులకు మంచి ధర చెల్లించేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో హార్టీకల్చర్‌ డీడీ కోటేశ్వరరావు, గుజ్జు పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2026 | 01:39 AM