Share News

స్వామికి థ్యాంక్స్‌ చెప్పాం

ABN , Publish Date - Jan 19 , 2026 | 01:54 AM

మా ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రానికి విజయానిచ్చిన శ్రీవేంకటేశ్వరస్వామికి థ్యాంక్స్‌ చెప్పేందుకు వచ్చామని హీరో శర్వానంద్‌ అన్నారు. ఆ చిత్ర దర్శకుడు రామ్‌ అబ్బరాజు, హీరోయిన్‌ సాక్షి వైద్యతో కలిసి ఆవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న ఆయన, ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. స్వామిని దర్శించుకోగానే పాజిటివ్‌ ఫీలింగ్‌ కలిగిందన్నారు. తొలిసారి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆనందాన్ని ఇచ్చిందని హీరోయిన్‌ సాక్షి వైద్య అన్నారు. ఆలయం ముందు వీరిని చూసేందుకు సినీ అభిమానులు ఉత్సాహం చూపారు. వారితో ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు.

స్వామికి థ్యాంక్స్‌ చెప్పాం
శర్వానంద్‌, సాక్షి వైద్య, రామ్‌ అబ్బరాజు

తిరుమల, ఆంధ్రజ్యోతి: మా ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రానికి విజయానిచ్చిన శ్రీవేంకటేశ్వరస్వామికి థ్యాంక్స్‌ చెప్పేందుకు వచ్చామని హీరో శర్వానంద్‌ అన్నారు. ఆ చిత్ర దర్శకుడు రామ్‌ అబ్బరాజు, హీరోయిన్‌ సాక్షి వైద్యతో కలిసి ఆవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న ఆయన, ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. స్వామిని దర్శించుకోగానే పాజిటివ్‌ ఫీలింగ్‌ కలిగిందన్నారు. తొలిసారి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆనందాన్ని ఇచ్చిందని హీరోయిన్‌ సాక్షి వైద్య అన్నారు. ఆలయం ముందు వీరిని చూసేందుకు సినీ అభిమానులు ఉత్సాహం చూపారు. వారితో ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు.

Updated Date - Jan 19 , 2026 | 01:54 AM