Share News

నడకమార్గంలో నాగుపాము

ABN , Publish Date - Jun 28 , 2026 | 01:04 AM

తిరుమల నడక మార్గంలో శనివారం ఓ నాగు పాము హడలెత్తించింది.గాలిగోపురం సమీపంలోని దుకాణాల వద్దకు సుమారు ఏడడుగుల పొడవైన నాగు పాము వచ్చింది.గమనించిన వ్యాపారులు, భక్తులు బెంబేలెత్తిపోయారు.

నడకమార్గంలో నాగుపాము

తిరుమల , జూన్‌ 27(ఆంధ్రజ్యోతి):తిరుమల నడక మార్గంలో శనివారం ఓ నాగు పాము హడలెత్తించింది.గాలిగోపురం సమీపంలోని దుకాణాల వద్దకు సుమారు ఏడడుగుల పొడవైన నాగు పాము వచ్చింది.గమనించిన వ్యాపారులు, భక్తులు బెంబేలెత్తిపోయారు. వెంటనే పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి భాస్కరనాయుడికి సమాచారమిచ్చారు. ఆయన అక్కడికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టాడు.

Updated Date - Jun 28 , 2026 | 01:04 AM