ప్రతి ధాన్యం గింజనూ కొంటాం
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:24 AM
ఖరీ్‌ఫలో 1.30,350 ఎకరాల్లో సుమారు 5.50లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది
తిరుపతి(కలెక్టరేట్), జనవరి 2(ఆంధ్రజ్యోతి): ‘ఖరీ్‌ఫలో 1.30,350 ఎకరాల్లో సుమారు 5.50లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది’ అని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. ఖరీఫ్ 2025-26ధాన్యం కొనుగోలు ముందస్తు ఏర్పాట్లు, సంసిద్ధతపై ఆయన శుక్రవారం వర్చువల్ విధానంలో అధికారులతో సమీక్షించారు. గ్రేడ్-ఏ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,389, సాధారణ రకం రూ.2,369 మద్దతు ధర నిర్ణయించినట్లు చెప్పారు. దీనికన్నా తక్కువ ధరకు ఏ రైతూ ధాన్యం విక్రయించే పరిస్థితి రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అవసరమైన గోదాములు, కూలీలు, రవాణాసదుపాయాలు, నాణ్యతా పరీక్షలకు అవసరమైన పరికరాలను ముందగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఈనెల 3వ వారం లోపు ఈ-క్రాప్ బుకింగ్ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి జేసీ మౌర్య, జిల్లా వ్యవసాయశాఖాధికారి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.