ఎన్నికలను బహిష్కరిస్తున్నాం
ABN , Publish Date - Oct 19 , 2026 | 01:55 AM
తాము స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని పార్టీలకతీతంగా నిర్ణయం తీసుకున్నట్లు వెదురుకుప్పం మండలం ముఠాలంకు చెందిన పి.రాజారెడ్డి, బాబురెడ్డి, గ్రామస్తులు ఆదివారం తెలిపారు.
వెదురుకుప్పం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): తాము స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని పార్టీలకతీతంగా నిర్ణయం తీసుకున్నట్లు వెదురుకుప్పం మండలం ముఠాలంకు చెందిన పి.రాజారెడ్డి, బాబురెడ్డి, గ్రామస్తులు ఆదివారం తెలిపారు. ‘మా గ్రామంలో 128 ఓట్లున్నాయి. గ్రామానికి రోడ్డు వసతి సరిగా లేదు. ఏటా మేమే డబ్బులు వేసుకుని మరమ్మతులు చేయించుకుంటున్నాం. మా గ్రామానికి తారు రోడ్డు మంజూరు చేయించాలని కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకనే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం’ అని చెప్పారు. ఈ మేరకు ఎంపీడీవో పురుషోత్తం, ఎస్ఐ నవీన్బాబుకు వినతిపత్రాలను ఇచ్చామన్నారు.