మేమంతా ఒక్కటే!
ABN , Publish Date - Oct 29 , 2026 | 01:22 AM
‘రాష్ట్రంలోని 17 మున్సిపాలిటీల్లో కూటమి ఏకగ్రీవంగా విజయకేతనం ఎగురేసింది. మదనపల్లెలోనూ అదే పరిస్థితి కళ్లముందే కనిపిస్తోంది. ఇక్కడి మున్సిపాలిటీని ప్రిస్జేజ్‌గా తీసుకున్నాం..ప్రజలకు మరింత భరోసా కల్పించడానికే అభ్యర్థులతో కలసి కూటమి నేతలంతా ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్తూ ఓట్లడుగుతున్నాం’ అని మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.
కూటమి విజయానికి కృషి చేస్తున్నాం
నేడు మదనపల్లెలో మహా ర్యాలీ
మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి
మదనపల్లె, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలోని 17 మున్సిపాలిటీల్లో కూటమి ఏకగ్రీవంగా విజయకేతనం ఎగురేసింది. మదనపల్లెలోనూ అదే పరిస్థితి కళ్లముందే కనిపిస్తోంది. ఇక్కడి మున్సిపాలిటీని ప్రిస్జేజ్‌గా తీసుకున్నాం..ప్రజలకు మరింత భరోసా కల్పించడానికే అభ్యర్థులతో కలసి కూటమి నేతలంతా ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్తూ ఓట్లడుగుతున్నాం’ అని మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎన్‌వీఆర్ కల్యాణ మండపంలో బుధవారం కూటమి నేతలతో మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ‘మేమంతా ఒక్కటే... కూటమి నేతలంతా ఏకతాటిపైకి వచ్చి.. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ కలిసే పనిచేస్తున్నాం..ఎక్కడా విభేదాలు లేవు’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఎం.షాజహాన్‌బాషా మాట్లాడుతూ త్రిబులింజన్ సర్కారుతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. గురువారం మదనపల్లెలో నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. జనసేన నేత గంగారపు రాందా్‌సచౌదరి మాట్లాడుతూ గత వైసీపీ పాలనను గుర్తుచేసుకుంటున్న ప్రజలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. బీజేపీ నేత చల్లపల్లె నరసింహారెడ్డి మాట్లాడుతూ సీట్ల సర్దుబాటులో ఇబ్బందులున్నా వాటిని అధిగమిస్తూ సమన్వయంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. చైర్మన్ అభ్యర్థి జి.శ్రీరామకుమార్(జి.శ్రీరామ్‌చినబాబు) మాట్లాడుతూ రెండో సీఎంగా చెబుతున్న పెద్దిరెడ్డి గత ఐదేళ్లలో పట్టణానికి చేసింది శూన్యమన్నారు. తనతోపాటు 48 మంది అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు రాటకొండ బాబురెడ్డి, దామచర్ల సత్యనారాయణ, కె.మల్లికార్జుననాయుడు, ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం, టౌన్‌బ్యాంకు చైర్మన్ ఎన్.విద్యాసాగర్, వై.దొరస్వామినాయుడు, ఆర్.జె.వెంకటేష్, పఠాన్ ఖాదర్‌ఖాన్, రాటకొండ మధుబాబు, తెలుగు యువత నేత మార్పురి వరుణ్, ప్రభాకర్ పాల్గొన్నారు.