ఓటర్లూ.. నిర్భయంగా ఓటేయండి
ABN , Publish Date - Nov 01 , 2026 | 01:47 AM
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవచ్చు’ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరులోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించారు.
కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపు
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవచ్చు’ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరులోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ‘సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ పోలింగ్ కేంద్రాల్లో అదనపు భద్రతా చర్యలు తీసుకున్నాం. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారి, అదనపు ప్రిసైడింగ్ అధికారితో పాటు, ముగ్గురు సిబ్బందిని, మైక్రో పరిశీలకులను నియమించాం. వీరికి రెండుసార్లు పోలింగ్ ప్రక్రియపై శిక్షణ అందించాం. పోలింగ్ సామగ్రితో పాటు సిబ్బందిని వాహనాలలో ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపాం. బస్సులో రూట్ అధికారిని కూడా పంపించాం. ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రాన్ని సిద్ధం చేస్తాం. ప్రజలు నిర్దేశించిన సమయంలోగా పోలింగ్ కేంద్రానికి చేరుకొని తమ ఓటుహక్కును వినియోగించుకోవాలి’ అని కలెక్టర్ సుమిత్‌కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో అయిదుగురికి మించి జనం గుమికూడరాదన్నారు. ఈ ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఇ.చిదానందం, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, ఆర్వో పుల్లారెడ్డి, ఆర్డీవో శ్రీనివాస నాయుడు తదితరులు పాల్గొన్నారు.