నలుగురు నేపాలీల ఓటరు దరఖాస్తు తిరస్కరణ
ABN , Publish Date - Sep 12 , 2026 | 01:23 AM
బతుకుతెరువు కోసం 30 ఏళ్ల కిందట జిల్లాకు వచ్చిన నలుగురు నేపాలివాసులు ఓటు హక్కు కోసం చేసుకున్న దరఖాస్తులను తిరస్కరించారు. పూతలపట్టు నియోజకవర్గ పరిధిలో నివాసముంటున్న వీరు ‘సర్’ ప్రక్రియలో భాగంగా కొత్తగా ఓటు కోసం ఫారం-6 సమర్పించారు.
చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): బతుకుతెరువు కోసం 30 ఏళ్ల కిందట జిల్లాకు వచ్చిన నలుగురు నేపాలివాసులు ఓటు హక్కు కోసం చేసుకున్న దరఖాస్తులను తిరస్కరించారు. పూతలపట్టు నియోజకవర్గ పరిధిలో నివాసముంటున్న వీరు ‘సర్’ ప్రక్రియలో భాగంగా కొత్తగా ఓటు కోసం ఫారం-6 సమర్పించారు. నేపాల్ నుంచి ఇటువైపు దాదాపు 30 ఏళ్ల క్రితం జిల్లాకు వచ్చి గూర్ఖా తదితర పనులు చేసుకుంటూ బతుకుదెరువు సాగిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఓటరు కార్డు ఉందని, అయితే 2002 జాబితాలో ఓటు లేకుండా బంధుత్వ ఆధారాలు చూపలేకపోవడంతో వారి ఓటు పునరుద్ధరణకు అధికారులు అంగీకరించలేదు. ఈ అంశంపై పూతలపట్టు నియోజవర్గ ఎన్నికల అధికారులు కలెక్టరేట్‌లోని జిల్లా ఎన్నికల విభాగం అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అయితే వారు భారతీయులేనని నిరూపించుకోవడానికి తగిన పత్రాలు ఫారంతో జతపరచలేకపోవడంతో ఆ నలుగురు దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.