వేడుకగా వినాయక నిమజ్జనం
ABN , Publish Date - Sep 25 , 2026 | 01:19 AM
చిత్తూరు నగరం డీఐ రోడ్డులో శ్రీ శివశక్తి వినాయక కమిటీచే 11 రోజులుగా నిర్వహిస్తున్న ‘చవితి’ ఉత్సవాలు గురువారం నిమజ్జనంతో ముగిశాయి. ఈ కమిటీ 50 ఏళ్లయిన సందర్భంగా 50 భారీ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరో ఐదు వివిధ దేవతా మూర్తుల విగ్రహాలనూ గురువారం నగర వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి కట్టమంచి చెరువులో నిమజ్జనం చేశారు. ఈ నిమజ్జనానికి నిర్వాహకులు 20 ట్యాంకర్ల నీటిని వాడారు
చిత్తూరు కల్చరల్, ఆంధ్రజ్యోతి: చిత్తూరు నగరం డీఐ రోడ్డులో శ్రీ శివశక్తి వినాయక కమిటీచే 11 రోజులుగా నిర్వహిస్తున్న ‘చవితి’ ఉత్సవాలు గురువారం నిమజ్జనంతో ముగిశాయి. ఈ కమిటీ 50 ఏళ్లయిన సందర్భంగా 50 భారీ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరో ఐదు వివిధ దేవతా మూర్తుల విగ్రహాలనూ గురువారం నగర వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి కట్టమంచి చెరువులో నిమజ్జనం చేశారు. ఈ నిమజ్జనానికి నిర్వాహకులు 20 ట్యాంకర్ల నీటిని వాడారు. ఈ ఊరేగింపు ముందు సాంస్కృతిక.. కళారూపాల ప్రదర్శనలు స్థానికులను అలరించాయి. నిమజ్జనానికి ముందు ఇక్కడ స్వామికి నైవేద్యంగా సమర్పించిన 1.5 టన్నుల లడ్డూ ప్రసాదానికి వేలం నిర్వహించగా, రూ.9 లక్షలకు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ దక్కించుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేతో పాటు నిర్వాహకులు కణ్ణన్, దీపక్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, నగర టీడీపీ అధ్యక్షుడు వరుణ్‌కుమార్, స్థానిక నేతలు, భక్తులు పాల్గొన్నారు.