కూటమి జయభేరి
ABN , Publish Date - Nov 08 , 2026 | 02:41 AM
తిరుపతి జిల్లాలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగింది.మొత్తం 35జడ్పీటీసీ స్థానాల్లో 20కూటమి పార్టీలు గెలుచుకోగా వైసీపీ మూడు గెలుచుకుంది.శనివారం అర్ధరాత్రి సమయానికి మరో 7స్థానాల్లో కూటమి, నాలుగు చోట్ల వైసీపీ ఆధిక్యతలో వున్నాయి.
కూటమి జయభేరి
ఉత్కంఠభరితంగా పరిషత్ ఓట్ల లెక్కింపు
35 జడ్పీటీసీల్లో 20 కూటమికి... వైసీపీకి 3
7 స్థానాల్లో కూటమి... 4 చోట్ల వైసీపీ ఆధిక్యం
317 ఎంపీటీసీల్లో 273 దక్కించుకున్న కూటమి
8 మండలాల్లో క్లీన్ స్వీప్ చేసిన మూడు పార్టీలు
తిరుపతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి):తిరుపతి జిల్లాలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగింది.మొత్తం 35జడ్పీటీసీ స్థానాల్లో 20కూటమి పార్టీలు గెలుచుకోగా వైసీపీ మూడు గెలుచుకుంది.శనివారం అర్ధరాత్రి సమయానికి మరో 7స్థానాల్లో కూటమి, నాలుగు చోట్ల వైసీపీ ఆధిక్యతలో వున్నాయి.చిట్వేలి మండలంలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటాపోటీ ఆధిక్యంలో వున్నారు.ఎంపీటీసీ స్థానాల్లో కూడా కూటమి ఆధిక్యత చాటుకుంది. 444 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి తొలుత 139 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఎన్నికలు జరిగిన 302 స్థానాల్లో శనివారం రాత్రి 12 గంటల సమయానికి 175 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. ఏకగ్రీవాలు, ఓట్ల లెక్కింపు ఫలితాల్లో కలిపి కూటమి 273 స్థానాలు గెలుచుకుని ఆధిపత్యం చాటుకోగా వైసీపీ కేవలం 38 స్థానాలకు పరిమితమైంది.జిల్లాలోని 35 మండలాలకు గానూ 8 మండలాల్లో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. ఆ మండలాల్లో వైసీపీకి అటు జడ్పీటీసీ, ఇటు ఎంపీటీసీ స్థానాలు ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కలేదు. వైసీపీ గెలిచిన ఎంపీటీసీ స్థానాల్లో అత్యధికం రైల్వే కోడూరు, సత్యవేడు, చంద్రగిరి నియోజకవర్గాల నుంచే వచ్చాయి.
జడ్పీటీసీ స్థానాల్లో కూటమి ఆధిక్యత
జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి కూటమి ఆధిక్యత చాటుకుంది. మొత్తం 35లో ముందే టీడీపీ శ్రీకాళహస్తి, ఏర్పేడు, నాయుడుపేట, ఓజిలి జడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకున్న సంగతి తెలిసిందే. మిగిలిన 31 స్థానాలకు శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో దొరవారిసత్రం, నాగలాపురం, పాకాల, పిచ్చాటూరు, రామచంద్రాపురం, సత్యవేడు, తడ, తొట్టంబేడు, వాకాడు, వెంకటగిరి, బాలాయపల్లె, డక్కిలి, నారాయణవనం జడ్పీటీసీలను గెలుచుకుంది. ఏకగ్రీవ స్థానాలు, ఎన్నికల్లో గెలిచినవి కలిపి మొత్తంగా 17 స్థానాలను టీడీపీ సాధించింది. ఇక బీజేపీ రేణిగుంట, సూళ్ళూరుపేట జడ్పీటీసీ స్థానాల్లో గెలుపొందగా జనసేన వరదయ్యపాలెం నుంచీ గెలిచింది. అన్నీ కలిపి కూటమి పార్టీలు 20 స్థానాల్లో విజయం సాధించాయి. ఇవి కాకుండా టీడీపీ చిట్టమూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట, చంద్రగిరి, పుత్తూరు, వడమాలపేట, బీఎన్కండ్రిగ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. వైసీపీ విషయానికొస్తే ఎర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు, పెళ్ళకూరు స్థానాల్లో గెలుపొందగా పెనగలూరు, రైల్వే కోడూరు, కేవీబీపురం, తిరుపతి రూరల్ స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. ఇందులో కేవీబీపురంలో వైసీపీ గెలుపొందగా టీడీపీ అభ్యర్థి అభ్యంతరాలతో రీకౌంటింగ్ జరుపుతున్నారు.
273 ఎంపీటీసీ స్థానాలు గెలిచిన కూటమి
జిల్లాలో కూటమి పార్టీలు శనివారం అర్ధరాత్రి వరకూ 273 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్నాయి. ఏకగ్రీవాలు, ఎన్నికల్లోనూ కలిపి టీడీపీ 250 స్థానాలు, జనసేన 14 స్థానాలు, బీజేపీ 9 స్థానాల చొప్పున సాధించాయి. వైసీపీ 38 స్థానాల్లో గెలిచి ఉనికి చాటుకోగా ఇతరులు ఆరు స్థానాల్లో గెలిచారు. ఇంకా 127 స్థానాల ఫలితాలు వెల్లడి కావాల్సి వుంది.
8 మండలాల్లో కూటమి క్లీన్ స్వీప్
పరిషత్ ఎన్నికల్లో కూటమి పార్టీలు ప్రాబల్యం చాటుకున్నప్పటికీ ప్రత్యేకించి ఎనిమిది మండలాల్లో క్లీన్ స్వీప్ చేశాయి. వైసీపీకి ఒక స్థానం కూడా దక్కకుండా అన్నింటినీ కైవసం చేసుకున్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శ్రీకాళహస్తి, ఏర్పేడు, రేణిగుంట మండలాల్లోనూ, సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం, సత్యవేడు మండలాల్లోనూ, నగరి నియోజకవర్గంలోని పుత్తూరు మండలం, చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల మండలం, సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని తడ మండలాల్లో అటు జడ్పీటీసీ, ఇటు ఎంపీటీసీ స్థానాలను వందశాతం కూటమి పార్టీలే గెలుచుకోవడం విశేషం.
ఐదు నియోజకవర్గాల్లో ఉనికి చాటుకున్న వైసీపీ
ఎర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు జడ్పీటీసీలతో పాటు పెళ్లకూరు జడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది. అలాగే పెనగలూరు, కేవీబీపురం జడ్పీటీసీ స్థానాల్లో ఆధిక్యతలో వుంది. ఎంపీటీసీ స్థానాల విషయానికొస్తే చంద్రగిరి నియోజకవర్గంలో 15 స్థానాలు, వెంకటగిరి నియోజకవర్గంలో 6 స్థానాలు, సూళ్ళూరుపేటలో 6 స్థానాలు చొప్పున గెలిచి ఉనికి చాటుకుంది. రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలంలో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలనూ వైసీపీయే గెలుచుకోవడం గమనార్హం.
అత్యల్ప ఓట్లతో గెలిచిన పలువురు అభ్యర్థులు
జిల్లాలో బీఎన్ కండ్రిగ మండలం తలారివెట్టు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి గంగమ్మ 3 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.రైల్వే కోడూరు మండలం ఓబనపల్లి-1 ఎంపీటీసీ స్థానంలో జనసేన అభ్యర్థి తాతంసెట్టి తులసి 4 ఓట్ల మెజారిటీతో, తిరుపతి రూరల్ పేరూరు-2 ఎంపీటీసీ వైసీపీ అభ్యర్థి దామినేటి కేశవులు 6 ఓట్లతో, వాకాడు మండల కేంద్రంలోని 2వ సెగ్మెంట్లో టీడీపీ అభ్యర్థి కాటంరెడ్డి రేవతి 7 ఓట్ల మెజారిటీతో, తొట్టంబేడు మండలం తాటిపర్తిలో టీడీపీ అభ్యర్థి నవీన్ 9 ఓట్ల మెజారిటీతో, డక్కిలి మండలం తీర్థంపాడులో టీడీపీ అభ్యర్థి 13 ఓట్లతో, అదే మండలం మోపూరులో వైసీపీ అభ్యర్థి 16 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక సత్యవేడు జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి హెచ్.సోనియా 8233 ఓట్ల అత్యధిక మెజారిటీ సాధించారు.
కిలివేటి స్వగ్రామంలో వైసీపీకి మూడో స్థానం
సూళ్ళూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు స్వగ్రామంలో చేదు అనుభవం ఎదురైంది. తడ మండలం కొండూరు ఆయన స్వగ్రామం. అక్కడ ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి మూడో స్థానానికి దిగజారారు. టీడీపీ అభ్యర్థి 483ఓట్ల ఆధిక్యతతో గెలుపొందగా ఇండిపెండెంట్ అభ్యర్థి రెండవ స్థానంలో నిలిచి సంచలనం సృష్టించారు. టీడీపీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ కంటే కూడా వైసీపీ అభ్యర్థికి తక్కువ ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థికి 423 ఓట్లు రాగా ఇండిపెండెంట్ అభ్యర్థికి ఏకంగా 963 ఓట్లు రావడం అటు వైసీపీ ప్రతిష్టను, ఇటు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రతిష్టనూ దెబ్బతీసినట్టయింది.