తిరుపతిలోనే విజయోత్సవ సభ
ABN , Publish Date - Jun 10 , 2026 | 01:39 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తిచేసుకోవడంతో పాటు ప్రధానిగా నరేంద్ర మోదీకి పుష్కరకాలం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం తిరుపతిలో భారీ విజయోత్సవ సభ జరగనుంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నిర్వహించతలపెట్టిన ఈ విజయోత్సవ సభలను తిరుపతికే పరిమితం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, నమ్మకం పేరిట తిరుపతి, వైజాగ్, అమరావతిలో విజయోత్సవ సభలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన కారణంగా రెండు సభలను రద్దు చేసి తిరుపతిలో శుక్రవారం భారీ బహిరంగ సభ
అమరావతి, విశాఖ ప్రాంతాల్లో సభల రద్దు
ఎన్డీఏ నేతలతో పాటు 50వేలమందికి ఏర్పాట్లు
ఎల్లుండి ఉదయం దామినేడు సమీపంలో సభ
తిరుపతి సిటీ, జూన్ 9 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తిచేసుకోవడంతో పాటు ప్రధానిగా నరేంద్ర మోదీకి పుష్కరకాలం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం తిరుపతిలో భారీ విజయోత్సవ సభ జరగనుంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నిర్వహించతలపెట్టిన ఈ విజయోత్సవ సభలను తిరుపతికే పరిమితం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, నమ్మకం పేరిట తిరుపతి, వైజాగ్, అమరావతిలో విజయోత్సవ సభలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన కారణంగా రెండు సభలను రద్దు చేసి తిరుపతిలో శుక్రవారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తిరుపతి రూరల్ మండలం దామినేడులోని ఇందిరమ్మ గృహాల సమీపంలో సభ ఏర్పాట్లను జిల్లా ఇంచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ పరిశీలించారు. సభ నిర్వహణపై అధికారులతో సమీక్షించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు అందించిన సుపరిపాలన, చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సభను నిర్వహిస్తున్నామన్నారు.రెండేళ్ల క్రితం క్యాబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 12నే విజయోత్సవ సభ ఏర్పాటుచేస్తున్నామన్నారు.కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు 50 వేల మంది ప్రజలు పాల్గొనేందుకు తగిన విధంగా ప్రాంగణాన్ని సిద్ధం చేయడంతో పాటు, అవసరమైన సదుపాయాలను కల్పిస్తామన్నారు.సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లో భరోసా కల్పించే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందన్నారు. ఎమ్మెల్యేలు పులివర్తి నాని, నెలవల విజయశ్రీ, పాశం సునీల్‌కుమార్, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ ఆర్.గోవిందరావు, ఆర్డీవో రామ్మోహన్, ఏపీజీబీసీ ఛైర్‌పర్సన్ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, నగర మాజీ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, టీడీపీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.