Share News

ఒక్క ఓటు తేడాతో విజయం

ABN , Publish Date - Nov 30 , 2026 | 01:45 AM

పెళ్లకూరు మండలం చెంబేడు పంచాయతీలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపాయి. చివరకు టీడీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి అనసంరెడ్డి సరిత ఒక్క ఓటుతో విజయం సాధించారు.

ఒక్క ఓటు తేడాతో విజయం

పెళ్లకూరు, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): పెళ్లకూరు మండలం చెంబేడు పంచాయతీలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపాయి. చివరకు టీడీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి అనసంరెడ్డి సరిత ఒక్క ఓటుతో విజయం సాధించారు. మొత్తం 1753 ఓట్లు పోలవ్వగా వైసీపీ బలపరిచిన బెల్లపు సౌజన్యకు 851, అనసంరెడ్డి సరితకు 852 ఓట్లు వచ్చాయి. ఇన్‌వాలిడ్‌తో పాటు నోటాతో కలిపి 50 ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయాయి.

దామరాయి పంచాయతీలో.....

సూళ్లూరుపేట, నవంబరు29(ఆంధ్రజ్యోతి): సూళ్లూరుపేట మండలం దామరాయి పంచాయతీ సర్పంచ్‌గా వైసీపీ మద్దతుదారు చేనె సులోచన ఒక ఓటు మెజార్టీతో గెలుపొందారు. ఈ పంచాయతీలో ముందుగా టీడీపీ మద్దతుదారు వెట్టి అక్కులయ్య రీ కౌంటింగ్‌లో ఒక ఓటుతో గెలిచినట్లు ప్రకటించారు. అయితే రీకౌంటింగ్‌లో వైసీపీ మద్దతుదారు గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.

6 ఓట్ల తేడాతో గెలుపు

పెళ్లకూరు, నవంబరు 29(ఆంధ్రజ్యోతి):పెళ్లకూరు మండలం జీలపాటూరు సర్పంచ్‌గా టీడీపీ మద్దతు అభ్యర్థి చింతల రమాదేవి వైసీపీ మద్దతు అభ్యర్థి కోగిలి రాగమ్మపై 6 ఓట్ల తేడాతో విజయం సాధించారు.5 వార్డుల్లో టీడీపీ, 3 వార్డుల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు.

Updated Date - Nov 30 , 2026 | 01:45 AM