శ్రీవారి సేవలో ఉప రాష్ట్రపతి
ABN , Publish Date - Oct 27 , 2026 | 01:58 AM
ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ వరాహస్వామిని దర్శించుకున్న ఆయన శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు
తిరుమల, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ వరాహస్వామిని దర్శించుకున్న ఆయన శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు.అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలుకగా టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి ఆలయం లోపలకు వెళ్లారు.ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించుకుని తరువాత మూలవిరాట్టును దర్శించుకున్నారు.తర్వాత వకుళమాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామిని దర్శించుకున్నారు.రంగనాయకుల మండపంలో వేద పండితులు ఉపరాష్ట్రపతికి వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ ఈవో, అదనపు ఈవో స్వామి వారి చిత్ర పటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.ఆలయం వెలుపలికి వచ్చిన తరువాత ఉపరాష్ట్రపతి అక్కడే గ్యాలరీల్లో ఉన్న భక్తుల వద్దకు వెళ్లి అభివాదం చేశారు.అనంతరం బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.అంతకుముందు పద్మావతి అతిథిగృహాల వద్ద ఆయనకు టీటీడీ ఈవో,ఏఈవోతో పాటు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ బోర్డు సభ్యులు రామ్మూర్తి, దివాకర రెడ్డి,ఎమ్మెల్యేలు పులివర్తి నాని,ఆరణి శ్రీనివాసులు తదితరులు స్వాగతం పలికారు.