నిప్పుల కొలిమి
ABN , Publish Date - May 23 , 2026 | 12:48 AM
జిల్లాలో శుక్రవారం కూడా ఎండతీవ్రత కొనసాగింది.
చిత్తూరు కలెక్టరేట్, మే 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్రవారం కూడా ఎండతీవ్రత కొనసాగింది. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఎండకు జనం బయటకు రాకపోవడంతో చిత్తూరులో 50శాతం దుకాణాలు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా మూసివేస్తున్నారు. మండలాల వారీగా.. నగరిలో 42.0, నిండ్ర, విజయపురంలో 41.5, చిత్తూరు రూరల్, చిత్తూరు అర్బన్‌లో 40.7, కార్వేటినగరంలో 40.6, తవణంపల్లెలో 40.4, పూతలపట్టులో 39.5, శ్రీరంగరాజపురంలో 39.3, గుడిపాలలో 39.2, గంగవరంలో 38.7, వెదురుకుప్పం, పులిచెర్లలో 38.6, ఐరాల, యాదమరి, పాలసముద్రం, పెద్దపంజాణి, పెనుమూరులో 38.0, పలమనేరులో 37.8, బంగారుపాళ్యంలో 37.5, రొంపిచెర్లలో 36.4, గంగాధరనెల్లూరులో 36.2, శాంతిపురంలో 35.7, గుడుపల్లెలో 35.7, వి.కోట, బైరెడ్డిపల్లెలో 34.7, కుప్పం, రామకుప్పంలో 34.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగత్రలు నమోదయ్యాయి.
తొమ్మిది మండలాల్లో వర్షం
అల్పపీడన ద్రోణి ప్రభావ కారణంగా గడిచిన 24 గంటల్లో తొమ్మిది మండలాల్లో తేలికపాటి నుంచి బలమైన వర్షం కురిసింది. పాలసముద్రంలో 30.2, నిండ్రలో 20.4, నగరిలో 19.2, రామకుప్పంలో 12.8, బైరెడ్డిపల్లిలో 12.4, కుప్పంలో 6.6, శ్రీరంగరాజపురంలో 4.2, శాంతిపురంలో 3.8, గుడుపల్లెలో 3.2 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.