వెరీ గుడ్.. సూపరమ్మా!
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:19 AM
వెరీ గుడ్.. సూపరమ్మా. నిన్ను మరో పదిమంది ఆదర్శంగా తీసుకోవాలి
‘వెరీ గుడ్.. సూపరమ్మా. నిన్ను మరో పదిమంది ఆదర్శంగా తీసుకోవాలి’ అని చిరు ఔత్సాహిక పారిశ్రామికవేత్త భుజం తట్టారు సీఎం చంద్రబాబు. శాంతిపురం మండల టీడీపీ అధ్యక్షుడు నందిగం ఉదయకుమార్ సోదరుడు నందిగం హరిప్రసాద్ కోతిగుట్లపల్లె సమీపంలో ఏర్పాటు చేసిన ఎన్విరాన్‌మెంటల్లీ కంట్రోల్డ్ (ఈసీ) కోళ్ల ఫారాన్ని ప్రారంభించారు. వంద శాతం యంత్రాలతో నడిచే ఈ అత్యాధునిక కోళ్ల ఫారం పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందని హరిప్రసాద్‌ను ప్రశ్నించారు. ‘నిరంతరం టెక్నాలజీ గురించి ఆలోచిస్తూ రాష్ట్రాభివృద్ధితోపాటు ప్రజలకు మెరుగైన సదుపాయాలను కల్పిస్తున్న మీరే నాకు స్ఫూర్తి’ అని ఆయన చెప్పగా, ‘వెరీ గుడ్, సూపరమ్మా’ అని మెచ్చుకున్నారు. ఆధునిక యంత్రాల వల్ల మ్యాన్‌పవర్ అవసరం లేకుండా ఆఽధునిక కోళ్లఫారం నడుస్తుందని, బలమైన, నాణ్యమైన కోళ్లు తయారవుతాయన్నారు. దీనికి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కోళ్ల రైతుకు ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ అత్యాధునిక కోళ్ల ఫారం నిర్వహణను అధ్యయనం చేయమని కలెక్టర్ సుమిత్ కుమార్, కడా పీడీ వికాస్ మర్మత్‌ను ఉద్దేశించి అన్నారు. ఇతర యువతకు సబ్సిడీలు ఇప్పించి, ఈసీ కోళ్ల ఫారంలు పెట్టుకునేలా చేసి, వారి ఆర్థిక ఉన్నతికి సహకరించాలని సూచించారు. అక్కడ్నుంచే అబీస్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రతినిధులతోనూ చంద్రబాబు మాట్లాడారు. కోడిపిల్లల సరఫరా, అందుకయ్యే వ్యయం, కోళ్లకు ఇచ్చే ధర తదితరాలపై చర్చించారు.
- కుప్పం/శాంతిపురం/గుడుపల్లె, ఆంధ్రజ్యోతి