నేటి సమాజానికి దిక్సూచిగా వేమన పద్యాలు
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:20 AM
‘సామాన్యులకు అర్థమయ్యేలా సరళమైన ప్రజాభాషలో వేమన పద్యాలున్నాయి. వాటిలోని తాత్విక భావనలు నేటి సమాజానికి దిక్సూచిగా నిలుస్తున్నాయి’ అని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు.
తిరుపతి(కలెక్టరేట్), జనవరి 19(ఆంధ్రజ్యోతి): ‘సామాన్యులకు అర్థమయ్యేలా సరళమైన ప్రజాభాషలో వేమన పద్యాలున్నాయి. వాటిలోని తాత్విక భావనలు నేటి సమాజానికి దిక్సూచిగా నిలుస్తున్నాయి’ అని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం యోగివేమన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తన పద్యాల ద్వారా కుల, మత, ఆర్ధిక బేధాలను ఖండిస్తూ సమానత్వం, మానవత్వం, సత్యం, నైతిక విలువలను ప్రజల్లో నాటేందుకు వేమన ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, శ్రీకాళహస్తి ఆర్డివో భానుప్రకా్‌షరెడ్డి, సెట్విన్ సీఈవో యశ్వంత్, టూరిజం అధికారి జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.