Share News

రేపటినుంచి వాయులింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Feb 09 , 2026 | 01:23 AM

వాయులింగేశ్వరుడిగా పరమశివుడు కొలువైన శ్రీకాళహస్తి క్షేత్రంలో మంగళవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 14 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలకు ఈనెల 10వ తేదీన కన్నప్ప ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది.

రేపటినుంచి వాయులింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
భక్తకన్నప్ప ఆలయం వద్ద ఏర్పాట్లు

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): వాయులింగేశ్వరుడిగా పరమశివుడు కొలువైన శ్రీకాళహస్తి క్షేత్రంలో మంగళవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 14 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలకు ఈనెల 10వ తేదీన కన్నప్ప ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. భక్తుడైన కన్నప్పకు తొలి పూజ అందుకునేలా ఇచ్చిన వరాన్ని ఈ క్షేత్రంలో నిర్వహించడం అనాదిగా వస్తోంది. 10న కన్నప్ప ధ్వజారోహణం, 11న స్వామివారి ధ్వజారోహణం, 15న మహాశివరాత్రి అనంతరం రాత్రి నందిసేవ, 16న ఉదయం రథోత్సవం, రాత్రి నారద పుష్కరణిలో తెప్పోత్సవం, 17న శివపార్వతుల కల్యాణోత్సవం, 19న గిరిప్రదక్షిణ, 21పల్లకీ సేవ, 22 ఏకాంతసేవ, 23 శాంతి అభిషేకాలతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాలకు శ్రీకాళహస్తి ముస్తాబైంది. పుష్ప, విద్యుద్దీపాలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. భక్తుల కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.

Updated Date - Feb 09 , 2026 | 01:23 AM