Share News

30 నుంచి తిరుమలలో వరుణయాగం

ABN , Publish Date - Aug 15 , 2026 | 01:28 AM

వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థిస్తూ తిరుమలలో ఐదురోజుల పాటు వరుణయాగాన్ని నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.

30 నుంచి తిరుమలలో వరుణయాగం

తిరుమల, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థిస్తూ తిరుమలలో ఐదురోజుల పాటు వరుణయాగాన్ని నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఎన్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశాలుండడంతో దేశవ్యాప్తంగా వర్షాలు పడి నీటి సమస్య లేకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ ధర్మగిరి వేదవిజ్ఞానపీఠం ఆధ్వర్యంలో వరుణయాగాన్ని నిర్వహించాలని ముహుర్తాన్ని నిర్ణయించారు. ఇందులో భాగంగా వేదవిజ్ఞానపీఠంలో యాగకర్త, రుత్వికుల సమక్షంలో ఆగస్టు 30, 31, సెప్టెంబరు 1, 2, 3 తేదీల్లో వరుణయాగాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీ ఉతర్వులు జారీ చేయగా, ఏర్పాట్లను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Updated Date - Aug 15 , 2026 | 01:28 AM