Share News

సెప్టెంబరు 15 నుంచి వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:34 AM

కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలు సెస్టెంబరు 15న ప్రారంభమవుతాయని ధర్మకర్తల మండలి చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్‌ తెలిపారు. ఆలయ సమావేశ మందిరంలో గురువారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశ వివరాలను వెల్లడించారు.

సెప్టెంబరు 15 నుంచి వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు
బోర్డు సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్‌ మణినాయుడు

భక్తులకు మోదక ప్రసాద పంపిణీ

స్వర్ణ రథోత్సవం టిక్కెట్‌ రూ.5 వేలు

బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

ఐరాల(కాణిపాకం), జూలై 22 (ఆంధ్రజ్యోతి): కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలు సెస్టెంబరు 15న ప్రారంభమవుతాయని ధర్మకర్తల మండలి చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్‌ తెలిపారు. ఆలయ సమావేశ మందిరంలో గురువారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశ వివరాలను వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రధాన.. అనుబంధ ఆలయాలకు రంగులు వేయడం, విద్యుద్దీపాలంకరణ వంటి 21 పనులకు ఆమోదం తెలిపామన్నారు. ఉభయదారుల సహకారంతో గతేడాదికంటే ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఇక నుంచి భక్తులకు మోదక ప్రసాదాన్ని పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. సంకటహర చతుర్థి రోజున నిర్వహించే స్వర్ణ రథోత్సవంలో పాల్గొనేందుకు టిక్కెట్‌ ధర రూ.5 వేలుగా నిర్ణయించామన్నారు. క్యూలైన్లలో, మాడ వీధుల్లో భక్తులకు తాగునీరు అందించడానికి సిబ్బందిని తీసుకోవాలని తీర్మానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో సాగర్‌బాబు, ఇన్‌చార్జి ఈఈ సతీష్‌, బోర్డు సభ్యులు నాగరాజునాయుడు, చంద్రశేఖర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, శివప్రసాద్‌, నరేష్‌, సతీష్‌, సుబ్రహ్మణ్యంరెడ్డి,చంద్రకళ, అనసూయ, వసంత, సునీత, రాజ్యలక్ష్మి, కృష్ణవేణి, పద్మలత, ఏఈవోలు ప్రసాద్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, ధనంజయ, ధనపాల్‌, సీఎ్‌ఫవో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2026 | 12:34 AM