చిలుక వాహనంపై వరసిద్ధుడు
ABN , Publish Date - Aug 28 , 2026 | 01:43 AM
కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి గురువారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా చిలుక వాహనంపై ఊరేగారు.
కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి గురువారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా చిలుక వాహనంపై ఊరేగారు. ఆలయ కల్యాణ వేదిక వద్ద సిద్ది, బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవర్లకు అర్చకులు అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామికి కల్యాణోత్సవం జరిపారు. ఉత్సవమూర్తులను చిలుక వాహనంపై ఉంచి పురవీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమానికి కాణిపాకానికి చెందిన రేపాకుల కుటుంబీకులు మోహన్‌శెట్టి, సోదరులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈవో పెంచలకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
- ఐరాల(కాణిపాకం), ఆంధ్రజ్యోతి