వరసిద్ధుడి హుండీ ఆదాయం రూ.2.11 కోట్లు
ABN , Publish Date - Jun 03 , 2026 | 01:53 AM
స్వయంభు కాణిపాక వరసిద్ధుని హుండీ ఆదాయం రూ.2,11,98,696 సమకూరింది. ఆలయ ఆస్థాన మండపంలో మంగళవారం స్వామివారి హుండీ కానుకలను ఈవో పెంచలకిషోర్ పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. ో 334 యూఎస్‌ఏ, 30 కెనడా, 12 సింగపూర్ డాలర్లు, 150 యూఏఈ దిర్హామ్స్, 53 మలేసియా రింగిట్స్ లభించాయి. 28 గ్రాముల బంగారు. 870 గ్రాముల వెండితో పాటు గో సంరక్షణ హుండీ ద్వారా రూ.18,241, అన్న ప్రసాద కేంద్రం వద్ద హుండీ ద్వారా రూ.2,48,609 సమకూరినట్లు ఈవో పేర్కొన్నారు. ఆలయానికి ఈ ఆదాయం 25 రోజుల్లో లభించిందన్నారు. ఈ లెక్కింపులో డీఈవో సాగర్‌బాబు,చిత్తూరు అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ, ఏఈవోలు ఎస్వీ.కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ప్రసాద్, ధనంజయ, సీఎఫ్‌వో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఐరాల(కాణిపాకం), జూన్ 2 (ఆంధ్రజ్యోతి): స్వయంభు కాణిపాక వరసిద్ధుని హుండీ ఆదాయం రూ.2,11,98,696 సమకూరింది. ఆలయ ఆస్థాన మండపంలో మంగళవారం స్వామివారి హుండీ కానుకలను ఈవో పెంచలకిషోర్ పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. ో 334 యూఎస్‌ఏ, 30 కెనడా, 12 సింగపూర్ డాలర్లు, 150 యూఏఈ దిర్హామ్స్, 53 మలేసియా రింగిట్స్ లభించాయి. 28 గ్రాముల బంగారు. 870 గ్రాముల వెండితో పాటు గో సంరక్షణ హుండీ ద్వారా రూ.18,241, అన్న ప్రసాద కేంద్రం వద్ద హుండీ ద్వారా రూ.2,48,609 సమకూరినట్లు ఈవో పేర్కొన్నారు. ఆలయానికి ఈ ఆదాయం 25 రోజుల్లో లభించిందన్నారు. ఈ లెక్కింపులో డీఈవో సాగర్‌బాబు,చిత్తూరు అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ, ఏఈవోలు ఎస్వీ.కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ప్రసాద్, ధనంజయ, సీఎఫ్‌వో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.