Share News

వరసిద్ధుడి హుండీ ఆదాయం రూ.1.41 కోట్లు

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:24 AM

కాణిపాక వరసిద్ధుడికి హుండీ ద్వారా రూ.1,41,68,426 లభించింది. ఆలయ ఆస్థాన మండపంలో గురువారం స్వామివారి హుండీ కానుకలను ధర్మకర్తల మండలి చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్‌ పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు.

వరసిద్ధుడి హుండీ ఆదాయం రూ.1.41 కోట్లు

ఐరాల(కాణిపాకం), ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): కాణిపాక వరసిద్ధుడికి హుండీ ద్వారా రూ.1,41,68,426 లభించింది. ఆలయ ఆస్థాన మండపంలో గురువారం స్వామివారి హుండీ కానుకలను ధర్మకర్తల మండలి చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్‌ పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. 32 గ్రాముల బంగారు. 1.42 కిలోల వెండితో పాటు 169 యూఎ్‌సఏ, 75 ఆస్ట్రేలియ, 5 కెనడా డాలర్లు, 110 ఇంగ్లాండ్‌ ఫౌండ్లు, 330 యూఏఈ దిర్హామ్స్‌, 1,110 సౌదీ రియాల్స్‌ లభించాయి. నిత్యాన్నప్రసాద కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన హుండీ ద్వారా రూ.1,45,499, గో సంరక్షణ హుండీ ద్వారా రూ.8,449 సమకూరాయి. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకోసం రూ.7,13,202 చెక్కుల రూపంలో దాతలు హుండీలో వేశారు. స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమంలో డీఈవో సాగర్‌బాబు, చిత్తూరు ఏసీ చిట్టెమ్మ, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ప్రసాద్‌, ప్రోటోకాల్‌ ఏఈవో ధనపాల్‌, సీఎ్‌ఫవో నాగేశ్వరరావు, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, బాలరంగస్వామి, ఆలయ సిబ్బంది, కాణిపాకం యూనియన్‌ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2026 | 12:24 AM