Share News

వరదరాజ స్వామి శ్రావణ వైభోగం

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:23 AM

స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధ ఆలయమైన వరదరాజస్వామి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని గరుడ సేవను వైభవంగా నిర్వహించారు.

వరదరాజ స్వామి శ్రావణ వైభోగం
గరుడ వాహనంపై విహరిస్తున్న వరదరాజస్వామి

కాణిపాకంలో వైభవంగా గరుడ సేవ

ఐరాల(కాణిపాకం), ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధ ఆలయమైన వరదరాజస్వామి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని గరుడ సేవను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో వరదరాజస్వామి మూల విరాట్‌కు అర్చకులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించారు. మూలవిరాట్‌ను వివిధ రకాల పూలమాలలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తర్వాత వరదరాజస్వామి ఉత్సవ విగ్రహాన్ని గరుడ వాహనంపై ఉంచి బాజాభజంత్రీల మధ్య కాణిపాకం వీధుల్లో ఘనంగా ఊరేగించారు. గ్రామస్తులు స్వామికి కొబ్బరికాయ,కర్పూరం,పళ్లు సమమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు శ్రీనివాసభట్టాచార్యులు ఉభయదారుగా వ్యవహరించారు. ఏటా ఆలయంలో శ్రావణ లక్ష్మీ వత్రాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ వాసు, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 12:23 AM