19న వందేమాతరం ‘ఆర్పీఎఫ్ బ్యాండ్’
ABN , Publish Date - Jan 14 , 2026 | 01:51 AM
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 19న సాయంత్రం 5-7 గంటల మధ్య తిరుపతి రైల్వేస్టేషన్ ముందు పెద్దఎత్తున ఆర్పీఎఫ్ బ్యాండ్ ప్రదర్శన ఇవ్వనున్నారు.
తిరుపతి(రైల్వే), జనవరి 13(ఆంధ్రజ్యోతి): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 19న సాయంత్రం 5-7 గంటల మధ్య తిరుపతి రైల్వేస్టేషన్ ముందు పెద్దఎత్తున ఆర్పీఎఫ్ బ్యాండ్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ప్రత్యేక వస్త్రధారణతో దాదాపు 20మంది కళాకారులు వివిధ వాద్యపరికరాలను వాయిస్తూ ‘వందేమాతరం’ గేయాన్ని వినిపించనున్నారు. దీనికోసం ఆరోజు రైల్వేస్టేషన్ ముందు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి తాత్కాలిక వేదికను ఏర్పాటు చేయనున్నారు.