కుప్పం తరహాలో నగరి అభివృద్ధి
ABN , Publish Date - Jan 25 , 2026 | 02:11 AM
‘నా సొంత నియోజకవర్గం కుప్పం తరహాలో నగరిని భావించి అభివృద్ధి చేస్తా’నని సీఎం చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నగరిలో ఏర్పాటుచేసిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు. ‘ఇక్కడి కోసలనగరంలో ఉన్న వేల ఎకరాల్ని పారిశ్రామికవాడగా అభివృద్ధి చేస్తాను. వంద కిలోమీటర్ల దూరంగానే రెండు ఎయిర్‌పోర్టులు, రెండు సీపోర్టులు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు వలసలు వెళ్లకుండా పరిశ్రమలు తీసుకొస్తాం. నగరిలో గత ఐదేళ్లు అభివృద్ధి అంటే తెలియకుండా పోయింది. ఇప్పుడు మంచి రోజులు మొదలయ్యాయి. కుప్పానికి హంద్రీనీవా ద్వారా కృష్ణాజలాలు తీసుకొచ్చాను. మదనపల్లె, పలమనేరు, పుంగనూరు చెరువులకు నీళ్లు వచ్చాయి. వచ్చే జూన్ నాటికి చిత్తూరుకు కూడా కృష్ణమ్మను తెస్తున్నాం. 2029 ఎన్నికల నాటికి నగరికి కృష్ణాజలాలు తీసుకొచ్చే బాధ్యత నాది. నగరి, పుత్తూరులను నూరు శాతం పరిశుభ్రమైన మున్సిపాలిటీలుగా చేసే బాధ్యత తీసుకుంటా’నని సీఎం చంద్రబాబు మాటిచ్చారు. నగరిలోని జడ్పీ పాఠశాలకు చెందిన యోగప్రియ, అక్షయ ప్రజావేదిక మీద నుంచి అందరితో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. వేదిక మీదనున్న సీఎం సహా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, వేదిక కింద ఉన్న ప్రజలు.. అంతా లేచి నిలబడి కుడి చేయి ముందుకు చాచి ప్రతిజ్ఞ చేశారు.
2029 ఎన్నికల నాటికి కృష్ణాజలాలు
కోసలనగరం అభివృద్ధికి ప్రత్యేక దృష్టి
నియోజకవర్గానికి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి
తండ్రి స్ఫూర్తితో ఎమ్మెల్యే భాను మంచిగా పనిచేయాలి
‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
నగరి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ‘నా సొంత నియోజకవర్గం కుప్పం తరహాలో నగరిని భావించి అభివృద్ధి చేస్తా’నని సీఎం చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నగరిలో ఏర్పాటుచేసిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు. ‘ఇక్కడి కోసలనగరంలో ఉన్న వేల ఎకరాల్ని పారిశ్రామికవాడగా అభివృద్ధి చేస్తాను. వంద కిలోమీటర్ల దూరంగానే రెండు ఎయిర్‌పోర్టులు, రెండు సీపోర్టులు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు వలసలు వెళ్లకుండా పరిశ్రమలు తీసుకొస్తాం. నగరిలో గత ఐదేళ్లు అభివృద్ధి అంటే తెలియకుండా పోయింది. ఇప్పుడు మంచి రోజులు మొదలయ్యాయి. కుప్పానికి హంద్రీనీవా ద్వారా కృష్ణాజలాలు తీసుకొచ్చాను. మదనపల్లె, పలమనేరు, పుంగనూరు చెరువులకు నీళ్లు వచ్చాయి. వచ్చే జూన్ నాటికి చిత్తూరుకు కూడా కృష్ణమ్మను తెస్తున్నాం. 2029 ఎన్నికల నాటికి నగరికి కృష్ణాజలాలు తీసుకొచ్చే బాధ్యత నాది. నగరి, పుత్తూరులను నూరు శాతం పరిశుభ్రమైన మున్సిపాలిటీలుగా చేసే బాధ్యత తీసుకుంటా’నని సీఎం చంద్రబాబు మాటిచ్చారు. నగరిలోని జడ్పీ పాఠశాలకు చెందిన యోగప్రియ, అక్షయ ప్రజావేదిక మీద నుంచి అందరితో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. వేదిక మీదనున్న సీఎం సహా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, వేదిక కింద ఉన్న ప్రజలు.. అంతా లేచి నిలబడి కుడి చేయి ముందుకు చాచి ప్రతిజ్ఞ చేశారు.
నగరి ప్రజల కోసం ముద్దుకృష్ణమ తపించారు
‘నగరి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. నా మిత్రుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు అనునిత్యం ఇక్కడి ప్రజలకోసం తపించేవారు. ఎన్టీఆర్ పిలుపు అందుకుని ప్రజా జీవితంలోకి వచ్చిన ఆయన తన చివరి శ్వాస వరకూ ప్రజల కోసం సేవ చేశారు. తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని ఎమ్మెల్యే భాను ఇంకా మంచిగా పని చేయాలని ఆశిస్తున్నా. భాను అమెరికాలో చదువుకున్నారు. అమెరికా ఒక అభివృద్ధి చెందిన దేశం. అమెరికా అనుభవాలకు ఇక్కడి సమస్యలను క్రోడీకరించి సమర్థమైన ఎమ్మెల్యేగా పనిచేస్తాడని విశ్వసిస్తున్నా. ఆల్ ది బెస్ట్. మనస్ఫూర్తిగా అభినందనలు’ అన్నారు.
గ్రీన్ అంబాసిడర్లకు సీఎం సన్మానం
ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు గ్రీన్ అంబాసిడర్లు, పారిశుద్ధ్య కార్మికులు రాజేంద్రన్, మురుగమ్మ, నారాణమ్మ, పార్వతి, నాగరాజును సన్మానించారు. జ్ఞాపిక, ప్రశంసా పత్రాలను అందించారు.
పర్యటన సాగిందిలా..
సీఎం చంద్రబాబు శనివారం మధ్యాహ్నం 12.10 గంటలకు నగరిలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు, నాయకులు స్వాగతం పలికారు. 12.50 గంటల వరకు స్టాళ్లను పరిశీలించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 12.55 గంటలకు ప్రజావేదిక సభకు చేరుకున్నారు. 2.50 గంటలకు ఎస్సీ హాస్టల్‌ను సందర్శించారు. 3.50 నుంచి 5.40 గంటల వరకు పార్టీ శ్రేణుల సమావేశంలో పాల్గొని తిరుగు ప్రయాణమయ్యారు.