రాయచోటిలో ఏకగ్రీవ విజయం
ABN , Publish Date - Oct 19 , 2026 | 02:06 AM
రాయచోటి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, పుంగనూరు టీడీపీ మాజీ ఇన్చార్జి చల్లా బాబు హర్షం వ్యక్తం చేశారు.
వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతున్నారు
మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
రాయచోటి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : రాయచోటి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, పుంగనూరు టీడీపీ మాజీ ఇన్చార్జి చల్లా బాబు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం విజయం సాధించిన అభ్యర్థులకు మిఠాయిలను తినిపించి సంతోషం వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ నాయకులు చేసిన దౌర్జన్యాలు, ఆరాచకాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతున్నారని మంత్రి మండిపల్లి పేర్కొన్నారు. వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన వైసీపీకి రాజకీయంగా ఎదురుదెబ్బలు తప్పవని స్పష్టం చేశారు.