Share News

అతిగా మద్యం తాగి ఇద్దరి మృతి

ABN , Publish Date - May 07 , 2026 | 01:24 AM

అతిగా మద్యం తాగి ఇద్దరు మృతిచెందిన ఘటన పెద్దతిప్పసముద్రం మండలం మద్దయ్యగారిపల్లెలో చోటుచేసుకుంది.

అతిగా మద్యం తాగి ఇద్దరి మృతి

పెద్దతిప్పసముద్రం మే 6 (ఆంధ్రజ్యోతి) : అతిగా మద్యం తాగి ఇద్దరు మృతిచెందిన ఘటన పెద్దతిప్పసముద్రం మండలం మద్దయ్యగారిపల్లెలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మద్దయ్యగారిపల్లెలో రెండు రోజులుగా కోటగంటి గంగమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన మగ్బూల్‌ కుమారుడు షామీర్‌ (52), కొత్తకోట శంకర (55) రెండు రోజులుగా మద్యం తాగుతూనే ఉన్నారు. అపస్మారక స్థితికి చేరడంతో స్థానికులు 108 వాహనంలో బి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు. గ్రామంలో మంగళవారం కూడా ఒకరు మృతిచెందారు.

Updated Date - May 07 , 2026 | 01:24 AM