అన్‌లోడింగ్‌కు రెండు రోజులు!
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:27 AM
గుజ్జు ఫ్యాక్టరీల వద్ద తోతాపురి మామిడి కాయల లోడ్లతో ట్రాక్లర్లు బారులు తీరాయి. గంగాధరనెల్లూరు పంచాయతీలోని రెండు జైన్‌ఫామ్‌ఫ్రెష్ ఫ్యాక్టరీల వద్ద సుమారు 350 ట్రాక్టర్లు ఉన్నాయి.
రెండు జైన్‌ఫ్యాక్టరీల వద్ద మామిడి కాయల లోడ్లతో బారులు తీరిన 350 ట్రాక్టర్లు
గుజ్జు ఫ్యాక్టరీల వద్ద తోతాపురి మామిడి కాయల లోడ్లతో ట్రాక్లర్లు బారులు తీరాయి. గంగాధరనెల్లూరు పంచాయతీలోని రెండు జైన్‌ఫామ్‌ఫ్రెష్ ఫ్యాక్టరీల వద్ద సుమారు 350 ట్రాక్టర్లు ఉన్నాయి. అన్‌లోడింగ్‌కు రెండు రోజుల సమయం పడుతోందని రైతులు వాపోతున్నారు. వారం రోజుల కిందట నుంచి రెండు జైన్ ఫ్యాక్టరీలకు రైతులు తమ తోపుల నుంచి మామిడికాయలను తీసుకొస్తున్నారు. తొలి రెండు రోజులు ఫ్యాక్టరీల వద్ద సందడి అంతగా లేదు. క్రమేణా వివిధ గ్రామాల నుంచి తోతాపురి మామిడికాయల లోడ్ల ట్రాక్టర్ల తాకిడి పెరిగింది. దీంతో 100 గొల్లపల్లె జైన్‌ఫ్యాక్టరీ-1 వద్ద సుమారు 200 ట్రాక్టర్లు.. జైన్‌ఫ్యాక్టరీ-2 వద్ద సుమారు 150 ట్రాక్టర్లు ఆయా రోడ్లకు రెండు వైపులా నిలబడ్డాయి. బుధవారం మధ్యాహ్నం 12 నుంచి గురువారం సాయంత్రం 6గంటలకుపైఆ ట్రాక్టర్లు బారులు తీరాయి. రైతులు, డ్రైవర్లు చెట్ల కింద పడిగాపులు కాస్తున్నారు. - గంగాధరనెల్లూరు, ఆంధ్రజ్యోతి