రెండు కార్లు ఢీ
ABN , Publish Date - Nov 19 , 2026 | 01:43 AM
రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం వేలూరు నుంచి పీలేరు వైపు వస్తున్న ఓ కారు పీలేరు-చిత్తూరు రహదారిలోని కోళ్లఫారం సమీపంలో అదుపుతప్పి
ఇద్దరి మృతి, మరికొందరికి గాయాలు
ఒకరి పరిస్థితి విషమం
పీలేరు-చిత్తూరు రహదారిలో ఘటన
పీలేరు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం వేలూరు నుంచి పీలేరు వైపు వస్తున్న ఓ కారు పీలేరు-చిత్తూరు రహదారిలోని కోళ్లఫారం సమీపంలో అదుపుతప్పి రాయచోటి నుంచి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొంది. ఇదే సమయంలో వెనుక వస్తున్న ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని అదుపు చేయలేక కారును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కారు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో 108 వాహనంలో వారిని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాలతో ఉండటంతో వారు తమ వివరాలు చెప్పలేకపోయారు. మదనపల్లె డీఎస్పీ కృష్ణమోహన్, ఎన్హెచ్ డీఈ సుజాత, పీలేరు సీఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతులు, క్షతగాత్రుల వివరాలపై ఆరా తీశారు. ఓ కారు రిజిస్ట్రేషన్ మేరకు రాయచోటికి చెందినట్లుగా గుర్తించి మృతుల ఫొటోలను రాయచోటి పోలీసులకు అందించి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.