Share News

మఠం పాలనా కమిటీలో టీటీడీ ఈవో

ABN , Publish Date - Jun 27 , 2026 | 01:06 AM

హథీరాంజీ మఠం ఆస్తుల నిర్వహణలో మహంతు అర్జున్‌దా్‌సకు అవసరమైన సాయం చేయడానికి మధ్యప్రదేశ్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ దుప్పల వెంకటరమణ ఆధ్వర్యంలో పరిపాలన కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. నెల రోజుల తర్వాత టీటీడీ ఈవో రవిచంద్రను దేవదాయశాఖ తరఫున నామినేట్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

  మఠం పాలనా కమిటీలో టీటీడీ ఈవో

తిరుపతి సిటీ, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): హథీరాంజీ మఠం ఆస్తుల నిర్వహణలో మహంతు అర్జున్‌దా్‌సకు అవసరమైన సాయం చేయడానికి మధ్యప్రదేశ్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ దుప్పల వెంకటరమణ ఆధ్వర్యంలో పరిపాలన కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఇందులో దేవదాయ శాఖ నుంచి ఒకరిని నామినేట్‌ చేయాలని ఆదేశించింది. నెల రోజుల తర్వాత టీటీడీ ఈవో రవిచంద్రను దేవదాయశాఖ తరఫున నామినేట్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీరితోపాటు సభ్యులుగా ఏపీకి చెందిన సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌, హైదరాబాద్‌కు చెందిన చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ మనీష్‌ టస్కర్‌, ఉజ్జయినికి చెందిన స్వామి మాధవ్‌ ప్రసన్నాచార్య, మధ్యప్రదేశ్‌ కేడర్‌ రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి మనీష్‌ కపూరియాల ఉంటారు. ఈ కమిటీ మూడు నెలల్లోపు మఠానికి సంబంధించిన అన్ని స్థిర, చరాస్తుల వివరాల జాబితా తయారు చేయాల్సి ఉంటుంది. అలాగే అపరిష్కృతంగా ఉన్న వివాదాల పర్యవేక్షణతోపాటు, ఆక్రమణల నుంచి మఠం ఆస్తులను కాపాడటానికి న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

Updated Date - Jun 27 , 2026 | 01:06 AM