నేడు టీటీడీ బోర్డు సమావేశం
ABN , Publish Date - Sep 09 , 2026 | 01:47 AM
తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం ఉదయం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరుగనుంది.దాదాపు 50 అంశాలతో రూపొందించిన అజెండాపై సమావేశంలో చర్చ జరుగనుంది.ప్రధానంగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించి కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు.
50అంశాలపై చర్చ
తిరుమల, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి):తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం ఉదయం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరుగనుంది.దాదాపు 50 అంశాలతో రూపొందించిన అజెండాపై సమావేశంలో చర్చ జరుగనుంది.ప్రధానంగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించి కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు.లడ్డూ తయారీ పోటులో దాదాపు 400 మంది అదనపు పోటు కార్మికుల నియామకానికి ప్రతిపాదించనున్నారు.డొనేషన్ పాలసీలో స్వల్ప మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. నామినీ పేర్లను మార్చుకునే వెసులుబాటు కల్పించేలా చర్చ జరుగనుంది. ఇక, కోర్టు ఆదేశాల మేరకు సుమారు 1,200 మంది కాంట్రాక్టు కార్మికులకు టైం స్కేల్ వర్తింపుపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశముంది. ముఖ్యంగా రూ.3 లక్షలుగా ఉన్న ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచే అంశంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు.