ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌పై నేడు టీటీడీ అదనపు ఈవో ప్రజంటేషన్
ABN , Publish Date - May 08 , 2026 | 01:53 AM
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల ఉపయోగార్థం గతేడాది ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)పై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి నేడు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.అమరావతిలోని కలెక్టర్ల సదస్సులో వెంకయ్య చౌదరి ఈ వ్యవస్థ ద్వారా అందిస్తున్న సేవలపై ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.ఎన్‌ఆర్‌ఐ దాతల సహకారంతో ఈ వ్యవస్థను వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో ఏర్పాటు చేయగా సీఎం చంద్రబాబు గతేడాది సెప్టెంబరులో ప్రారంభించారు.దేశంలోనే తొలిసారిగా ఆలయాల ప్రాంతంలో ఇటువంటి టెక్నాలజీతో కూడిన ప్రాంతాన్ని తిరుమలలో ఏర్పాటు
తిరుమల, మే 7(ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల ఉపయోగార్థం గతేడాది ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)పై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి నేడు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.అమరావతిలోని కలెక్టర్ల సదస్సులో వెంకయ్య చౌదరి ఈ వ్యవస్థ ద్వారా అందిస్తున్న సేవలపై ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.ఎన్‌ఆర్‌ఐ దాతల సహకారంతో ఈ వ్యవస్థను వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో ఏర్పాటు చేయగా సీఎం చంద్రబాబు గతేడాది సెప్టెంబరులో ప్రారంభించారు.దేశంలోనే తొలిసారిగా ఆలయాల ప్రాంతంలో ఇటువంటి టెక్నాలజీతో కూడిన ప్రాంతాన్ని తిరుమలలో ఏర్పాటు చేయడంపై పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.ప్రస్తుతం భారీ డిజిటల్ స్ర్కీన్ ద్వారా సీసీ కెమెరాల ఫుటేజ్‌ను ఇందులో పరిశీలిస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో ఏ కంపార్టుమెంట్లలో భక్తులు ఎక్కువగా ఉన్నారు, ఏ కంపార్టుమెంట్ ఖాళీగా ఉంది, ఎక్కడ లైన్ ఆగి ఉంది, ఎక్కడైనా ఖాళీలు ఉన్నాయా అనే అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆయా విభాగాల అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. రద్దీని ఎప్పటికప్పుడు గుర్తించి ఏఐ ద్వారా ట్రాక్ చేస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా భక్తులను గుర్తించడం, ఏదైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా,ఎవరైనా తప్పిపోయినా గుర్తించేలా ఈ వ్యవస్థ పనిచేస్తోంది. ఏడాదిలో ఏఏ సమయాల్లో ఎంతమంది దర్శనానికి వస్తున్నారు, ఏఏ మాసాల్లో రద్దీ తక్కువగా ఉంటోంది, ఏ భక్తుడికి ఎంత సమయంలో దర్శనం పూర్తయిందనే సమాచారాన్ని కూడా ఈ సెంటర్ ద్వారా పొందుపరుస్తున్నారు. ఆలయ నిర్వహణను మొత్తం డిజిటల్‌గా మార్చడం ద్వారా పొందిన అద్భుత ఫలితాలను వెంకయ్య చౌదరి సదస్సులో వివరించనున్నారు.